పెరిగిన పెట్రోల్ ధర.. ఏ నగరంలో ఎంత పెరిగిందంటే..

|

Aug 24, 2020 | 11:30 AM

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరులు పెరుగుతూనే ఉన్నాయి. చమురు కంపెనీలు వినియోగదారులు షాక్‌నిస్తున్నాయి. గత పది రోజులుగా పెట్రోల్‌ ధరను పెంచుతూ వస్తున్నాయి.

పెరిగిన పెట్రోల్ ధర.. ఏ నగరంలో ఎంత పెరిగిందంటే..
Follow us on

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరులు పెరుగుతూనే ఉన్నాయి. దేశీయంగా పలు నగరాలలో పెట్రోల్ ధర వాహనదారులకు మళ్లీ షాకిచ్చింది. వరుసగా 10వ రోజు పెట్రోల్ ధర పెరిగింది. చమురు కంపెనీలు వినియోగదారులకు షాక్‌కు గురిచేస్తున్నాయి. గత పది రోజులుగా పెట్రోల్‌ ధరను పెంచుతూ వస్తున్నాయి.

దేశంలో తాజాగా సోమవారం లీటర్‌ పెట్రోల్‌పై 13పైసల వరకు పెంచగా.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.81.62కి చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌కు రూ.84.83, కొల్‌కతాలో రూ.83.13 ముంబైలో రూ.88.28 చెన్నైలో రూ.84.64 బెంగళూరులో రూ.84.27 భువనేశ్వర్‌లో రూ.82.01 జైపూర్‌లో రూ.88.78 పాట్నాలో 84.35 త్రివేండం రూ.83.22 చేరింది.

గత పది రోజుల్లో రూపాయికిపైగా పెంచాయి. అయితే డీజిల్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో లీటర్‌కు రూ.73.56 ఉండగా, హైదరాబాద్‌లో లీటర్‌కు రూ.80.17గా ఉంది. నిత్యం ధరలపై చమురు సంస్థలు సమీక్ష జరుపుతుండగా రేట్లు పెరుగుతూ వస్తున్నాయి.