మహిళలకు ఈ రోజు శుభదినం: చంద్రబాబు

విజయవాడ: నేడు మహిళలకు శుభదినమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పసుపు-కుంకుమ పథకం కింద రెండో విడత సొమ్మును నేడు మహిళల ఖాతాలో వేయనున్నట్టు ఆయన తెలిపారు. టీడీపీ నాయకులు, బూత్ లెవల్ కన్వినర్లతో అమరావతిలో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక్కో మహిళ ఖాతాలో రూ. 3,500 డిపాజిట్ చేయబోతున్నామని చంద్రబాబు చెప్పారు. మహిళలందరి ఖాతాల్లోకి డబ్బు చేరాలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పసుపు కుంకుమ తర్వాత విడతలో […]

మహిళలకు ఈ రోజు శుభదినం: చంద్రబాబు

Updated on: Mar 07, 2019 | 11:22 AM

విజయవాడ: నేడు మహిళలకు శుభదినమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పసుపు-కుంకుమ పథకం కింద రెండో విడత సొమ్మును నేడు మహిళల ఖాతాలో వేయనున్నట్టు ఆయన తెలిపారు. టీడీపీ నాయకులు, బూత్ లెవల్ కన్వినర్లతో అమరావతిలో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక్కో మహిళ ఖాతాలో రూ. 3,500 డిపాజిట్ చేయబోతున్నామని చంద్రబాబు చెప్పారు.

మహిళలందరి ఖాతాల్లోకి డబ్బు చేరాలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పసుపు కుంకుమ తర్వాత విడతలో భాగంగా రూ. 4000 నగదును మహిళలకు కేటాయించనున్నట్టు చంద్రబాబు చెప్పారు. టీడీపీ అమలు చేస్తున్న పథకాలను చూసి టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ ఓర్వలేకపోతున్నాయని, డేటా చోరీ వెనక ఆ పార్టీల హస్తం ఉందని చంద్రబాబు అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us