నిషేధిత సంస్థలకు చెందిన 121 మందిని అరెస్ట్ చేసిన పాక్

| Edited By:

Mar 07, 2019 | 3:12 PM

ప్రపంచ దేశాల ఒత్తిడోతోనే.. లేక భారత్ ఆగ్రహానికో కానీ.. మొత్తానికి పాకిస్థాన్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నామని ప్రకటించింది. ఇప్పటికే నిషేధిత సంస్థలకు చెందిన వారిని అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 121 మందిని అరెస్ట్ చేసినట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాదు 182 మదర్సాలను కూడా పాక్ ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. తమ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంతో తాము ఇదంతా చేశామని… భారత్ ఆగ్రహం వ్యక్తం చేసిందన్న కారణంతో కాదని పాక్ అంతర్గత వ్వవహారాల శాఖ […]

నిషేధిత సంస్థలకు చెందిన 121 మందిని అరెస్ట్ చేసిన పాక్
Follow us on

ప్రపంచ దేశాల ఒత్తిడోతోనే.. లేక భారత్ ఆగ్రహానికో కానీ.. మొత్తానికి పాకిస్థాన్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నామని ప్రకటించింది. ఇప్పటికే నిషేధిత సంస్థలకు చెందిన వారిని అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 121 మందిని అరెస్ట్ చేసినట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాదు 182 మదర్సాలను కూడా పాక్ ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. తమ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంతో తాము ఇదంతా చేశామని… భారత్ ఆగ్రహం వ్యక్తం చేసిందన్న కారణంతో కాదని పాక్ అంతర్గత వ్వవహారాల శాఖ వ్యాఖ్యానించింది.

మదర్సాల విషయంలో ఏం చేయాలనేది పాకిస్థాన్ లో ఇప్పుడు ఒక సవాల్ గా పరిణమించింది. యువతలో రాడికల్ భావజాలాన్ని మదర్సాలు నింపుతున్నాయనే ఆరోపణలు ఇటీవలి కాలంలో ఆ దేశంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరోవైపు పేద దేశమైన పాక్ లో లక్షలాది పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నది కూడా మదర్సాలే.