బ్రేకింగ్: సుప్రీం ముందుకు నిమ్మగడ్డ మేటర్

|

May 30, 2020 | 1:49 PM

నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమించిన ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలైంది. జగన్ సర్కార్ కంటే ముందుగానే ఓ రాజకీయ నాయకుడు నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీం మెట్లెక్కారు.

బ్రేకింగ్: సుప్రీం ముందుకు నిమ్మగడ్డ మేటర్
Follow us on

Nimmagadda matter reached Supreme court on Saturday:  నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమించిన ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలైంది. ఏఐసీసీ కార్యదర్శి మస్తాన్ వలీ శనివారం సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. రమేశ్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునర్నియామకం చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు కథనాలు వస్తున్న తరునంలో ఏఐసీసీ కార్యదర్శి ముందుగానే సుప్రీం మెట్లెక్కారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదన విన్నాకే ఆదేశాలు ఇవ్వాలని ఏఐసీసీ కార్యదర్శి మస్తాన్ వలీ తన కేవియట్ పిటిషన్‌లో కోరారు. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉందని ముందుగానే కెవియట్ వేసినట్లు మస్తాన్ వలీ తెలిపారు. కాగా.. సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయనిఫుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.