హ్యాట్సాఫ్.. పారిశుద్ద్య కార్మికులను వీరు ఎలా సత్కరించారో చూడండి..!

| Edited By: Pardhasaradhi Peri

Apr 01, 2020 | 8:51 PM

ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎంతలా వ్యాపిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పరిశుభ్రత అనేది ముఖ్యం. ఈ వైరస్ ఇతరులనుంచి వ్యాపించకుండా ఉండాలంటే.. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాల్సిందే. అంతే కాదు.. పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాల్సిందే. మరి ఆ పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే.. ఎక్కడైనా సరే.. పారిశుద్ద్య కార్మికుల పాత్ర కీలకం. ఏ కాలంలోనైనా.. ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. అన్నింటిని ఎదుర్కొని వీధులను శుభ్రం చేస్తారు ఈ పారిశుద్ధ్య కార్మికులు. అలాంటి వీరిపై పంజాబ్‌లోని ఓ […]

హ్యాట్సాఫ్.. పారిశుద్ద్య కార్మికులను వీరు ఎలా సత్కరించారో చూడండి..!
Follow us on

ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎంతలా వ్యాపిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పరిశుభ్రత అనేది ముఖ్యం. ఈ వైరస్ ఇతరులనుంచి వ్యాపించకుండా ఉండాలంటే.. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాల్సిందే. అంతే కాదు.. పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాల్సిందే. మరి ఆ పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే.. ఎక్కడైనా సరే.. పారిశుద్ద్య కార్మికుల పాత్ర కీలకం. ఏ కాలంలోనైనా.. ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. అన్నింటిని ఎదుర్కొని వీధులను శుభ్రం చేస్తారు ఈ పారిశుద్ధ్య కార్మికులు. అలాంటి వీరిపై పంజాబ్‌లోని ఓ కాలనీ వాసులు తమదైన శైలిలో కృతజ్ఞత చాటుకున్నారు. గల్లీల్లో వెళ్తున్న పారిశుద్ద్య కార్మికులపై పూలవర్షం కురిపంచి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేశారు. అంతేకాదు.. వారిని పూల దండలతో పాటు.. కరెన్సీ నోట్ల దండలు చేసి వారి మెడలో వేసి సత్కరించారు. పంజాబ్‌లోని పటియాలా జిల్లా నభా పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. పారిశుద్ధ్య కార్మికుడు.. తన రిక్షాతో స్ట్రీట్‌లోకి ఎంటర్‌ కాగానే.. అక్కడి కాలనీ వాసులంతా వారివారి అపార్ట్‌మెంట్‌ల నుంచి పూల వర్షం కురిపించారు.

ఈ వీడియోను పంజాబ్‌ సీఎం కెప్టెన్ అమరీందర్ సిందగ్ తన అధికారిక ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ప్రజలు పారిశుద్ద్య కార్మికుల పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలపై హర్షం వ్యక్తం చేశారు.