ఈ ఇద్దరి కాంబినేషన్..! బొమ్మ హిట్టు అంతే..!
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ సినిమా చేయబోతున్నారు.. అనేదానిపై సౌత్ ఇండియా మొత్తం చర్చ జరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చిత్రం ఉంటుందనేది ఇప్పటికే అధికారికంగా బయటికి వచ్చిన సమాచారం.

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ సినిమా చేయబోతున్నారు.. అనేదానిపై సౌత్ ఇండియా మొత్తం చర్చ జరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చిత్రం ఉంటుందనేది ఇప్పటికే అధికారికంగా బయటికి వచ్చిన సమాచారం. అయితే ఈ చిత్రం కాకుండా మరో సినిమా రాబోతోందని ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ‘కేజీఎఫ్’ చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ మారిపోయిన ప్రశాంత్ నీల్ చేసిన ట్వీట్… ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ చేసిన మరో ట్వీట్ ఇప్పుడు ఆ చర్చను మరింత మందుకు తీసుకెళ్లింది.
మే 20న ఎన్టీఆర్ బర్త్ డే రోజు ప్రశాంత్ నీల్ ఓ ట్వీట్ చేశారు. అందులో… ఎన్టీఆర్ ఎనర్జీ లెవల్స్‌ను తట్టుకోవాలంటే తనకు ఓ రేడియేషన్ సూట్ అవసరమని అర్థం వచ్చేలా ట్వీట్ చేస్తూ ఆ రోజు ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు నీల్. ఆ తర్వాత తిరిగి జూన్ 4న ప్రశాంత్ నీల్ బర్త్ డే సందర్భంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ ట్వీట్ చేసింది. అందులో నీల్ చేసిన ట్వీట్‌కు సరిగ్గా సరిపోయేలా ఆ ట్వీట్ ఉంది. అదేంటంటే… ‘రేడియేషన్ సూట్’లో మిమ్మల్ని కలిసేందుకు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాం’’ అని ఈ ట్వీట్ సారాశం.
దీంతో ఇద్దరు కలసి ఓ ప్యాన్ ఇండియా స్థాయిలో మూవీ చేయనున్నారు అని ఫ్యాన్స్‌కు ఓ క్లారిటీ వచ్చేసింది. ఇక ఖచ్చితంగా వీరిద్దరి కాంబినేషన్‌లో అదిరిపోయే సినిమా ఉంటుందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందనేది తెలుగు సినీ నగర్ అంతా కోడై కూస్తోంది.