రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ కు తీర్మానం.!

|

Sep 21, 2020 | 9:10 AM

రాజ్యసభలో ఆదివారం విపక్ష ఎంపీల ప్రవర్తనపై అధికారపక్షం సీరియస్ గా ఉంది. రూల్ 256 ప్రకారం సభ్యుల సస్పెన్షన్ కోరుతూ తీర్మానానికి సిద్ధమైంది. ఈ ఉదయం గం. 9.05 కు ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టనున్నారు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. రైతు బిల్లులపై ఓటింగ్ సమయంలో విపక్ష ఎంపీలు పోడియంలోకి దూసుకురావడం.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు దురుసు ప్రవర్తన మోదీ సర్కారుకు మింగుడుపడ్డంలేదు. బెంచీల మీదకెక్కి విపక్ష ఎంపీలు హంగామా సృష్టించడం.. ఎంపీలను […]

రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ కు తీర్మానం.!
Follow us on

రాజ్యసభలో ఆదివారం విపక్ష ఎంపీల ప్రవర్తనపై అధికారపక్షం సీరియస్ గా ఉంది. రూల్ 256 ప్రకారం సభ్యుల సస్పెన్షన్ కోరుతూ తీర్మానానికి సిద్ధమైంది. ఈ ఉదయం గం. 9.05 కు ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టనున్నారు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. రైతు బిల్లులపై ఓటింగ్ సమయంలో విపక్ష ఎంపీలు పోడియంలోకి దూసుకురావడం.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు దురుసు ప్రవర్తన మోదీ సర్కారుకు మింగుడుపడ్డంలేదు. బెంచీల మీదకెక్కి విపక్ష ఎంపీలు హంగామా సృష్టించడం.. ఎంపీలను బయటకు తీసుకెళ్లేందుకు వచ్చిన మార్షల్స్‌పైనా దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఓ మార్షల్‌ను చేత్తో నెట్టేసిన ఘటనతోపాటు పై వీడియో ఫుటేజి పరిశీలించిన అనంతరం ఎంపీలపై కఠిన చర్యలకు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి డిప్యూటీ చైర్మన్ ఎదురుగా బల్లలు ఎక్కినందుకు..సభలో క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డందుకు మొత్తం 8 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం కనిపిస్తోంది.