
దేశంలో త్వరలో మరిన్ని రైళ్లను అనుమతిస్తామని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించారు. వారాల తరబడి లాక్ డౌన్ అనంతరం దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాల్సిందే అన్నారు. రైలు టికెట్ల బుకింగ్ లు దేశ వ్యాప్తంగా 1.7 లక్షల బుకింగ్ సెంటర్లలో శుక్రవారంనుంచి మొదలవుతాయని, రెండు మూడు రోజుల్లో రైల్వే స్టేషన్లలో మళ్ళీ టికెట్ కౌంటర్లను పునరుధ్ధరిస్తామని ఆయన చెప్పారు. అయితే మొదట ప్రోటోకాల్ ను పాటిస్తామన్నారు. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.