70 జమాతే ఇస్లామీ కార్యాలయాలపై పోలీసుల దాడులు.. రూ.52కోట్ల ఆస్తులు సీజ్

| Edited By:

Mar 02, 2019 | 11:36 AM

శ్రీనగర్ : జమ్మూకశ్మీరులోని జమాతే ఇస్లామీ సంస్థను కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధించిన నేపథ్యంలో ఆ సంస్థకు చెందిన 70 కార్యాలయాలపై పోలీసులు దాడులు చేశారు. జమాతే ఇస్లామీ ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బుల్ ముజాహిదీన్ కు నిధులు అందజేస్తుందనే అనుమానాలపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. జమ్ముకశ్మీర్ లోని జమాతే ఇస్లామీకి చెందిన కార్యాలయాల్లో రూ.52కోట్ల ఆస్తులను పోలీసులు సీజ్ చేశారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారనే ఆరోపణలపై పలువురు జమాతే ఇస్లామీ నేతలను పోలీసులు […]

70 జమాతే ఇస్లామీ కార్యాలయాలపై పోలీసుల దాడులు.. రూ.52కోట్ల ఆస్తులు సీజ్
Follow us on

శ్రీనగర్ : జమ్మూకశ్మీరులోని జమాతే ఇస్లామీ సంస్థను కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధించిన నేపథ్యంలో ఆ సంస్థకు చెందిన 70 కార్యాలయాలపై పోలీసులు దాడులు చేశారు. జమాతే ఇస్లామీ ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బుల్ ముజాహిదీన్ కు నిధులు అందజేస్తుందనే అనుమానాలపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. జమ్ముకశ్మీర్ లోని జమాతే ఇస్లామీకి చెందిన కార్యాలయాల్లో రూ.52కోట్ల ఆస్తులను పోలీసులు సీజ్ చేశారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారనే ఆరోపణలపై పలువురు జమాతే ఇస్లామీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. జమాతే ఇస్లామీ నడుపుతున్న విద్యాసంస్థలతోపాటు పలు కార్యాలయాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పుల్వామా ఉగ్ర దాడి ఘటన అనంతరం జాతి వ్యతిరేక, విచ్ఛిన్నకర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్న ఈ సంస్థను ఐదేళ్లపాటు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్ర హోంశాఖ ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3 కింద ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. జమ్మూకశ్మీరు పోలీసులు ఇటీవల జమాతే ఇస్లామీ చీఫ్‌ అబ్దుల్‌ హామిద్‌ ఫయాజ్‌ సహా పలువురు నేతలను అరెస్టు చేశారు.