లోక్‌సభ మూడో విడత ఎన్నికలు దేశ వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తాజాగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సూపర్‌స్టార్ మోహన్ లాల్‌లు ఓటేశారు. కోచిలో మమ్ముట్టి ఓటేయగా.. తిరువనంతపురంలో మోహన్‌లాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా క్యూలో నిల్చొని వారు తమ ఓటును వేశారు.
Kerala: Veteran actors Mammootty and Mohanlal cast their votes in Kochi and Thiruvananthapuram respectively. #LokSabhaElection2019 pic.twitter.com/qwrr4JfQcV
— ANI (@ANI) April 23, 2019