శ్రీనగర్.. ఉగ్రదాడికి చెక్ పెట్టిన పోలీసులు.. బెడిసి కొట్టిన జైషే మహ్మద్ ప్లాన్

| Edited By: Pardhasaradhi Peri

Jan 16, 2020 | 6:27 PM

గణతంత్ర దినోత్సవాలకు  ముందు జమ్మూ కాశ్మీర్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్  పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.గురువారం మధ్యాహ్నం శ్రీనగర్లో ఈ సంస్థకు చెందిన అయిదుగురు అనుమానిత టెర్రరిస్టులను వారు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరిని ఐజాజ్ అహ్మద్ షేక్, ఉమర్ హమీద్ షేక్, ఇంతియాజ్ అహ్మద్ చిక్లా, సాహిల్ ఫరూక్, నసీర్ అహ్మద్ మీర్ గా గుర్తించారు. వీరంతా […]

శ్రీనగర్.. ఉగ్రదాడికి చెక్ పెట్టిన పోలీసులు.. బెడిసి కొట్టిన  జైషే మహ్మద్ ప్లాన్
Follow us on

గణతంత్ర దినోత్సవాలకు  ముందు జమ్మూ కాశ్మీర్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్  పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.గురువారం మధ్యాహ్నం శ్రీనగర్లో ఈ సంస్థకు చెందిన అయిదుగురు అనుమానిత టెర్రరిస్టులను వారు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరిని ఐజాజ్ అహ్మద్ షేక్, ఉమర్ హమీద్ షేక్, ఇంతియాజ్ అహ్మద్ చిక్లా, సాహిల్ ఫరూక్, నసీర్ అహ్మద్ మీర్ గా గుర్తించారు. వీరంతా హజ్రత్ బల్ ప్రాంతానికి చెందినవారని తెలిసింది. కాశ్మీర్ లోయలో ఇంతకాలం అమలులో ఉన్న ఆంక్షలను క్రమేపీ ఎత్తివేస్తున్న దశలో ఈ  పరిస్థితిని తమకు అనువుగా వినియోగించుకుని వీరు దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడైంది. ఇప్పటికే ఇంటర్నెట్ కనెక్టివిటీని ప్రభుత్వం పాక్షికంగా ఎత్తివేసిన సంగతి విదితమే. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.