Breaking మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్

| Edited By: Pardhasaradhi Peri

Apr 08, 2020 | 6:27 PM

దేశంలో ఒక వైపు లాక్ డౌన్ కొనసాగింపుపై చర్చలు కొనసాగుతుంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మందుబాబులకు శుభవార్త వినిపించారు. నిత్యావసర వస్తువుల మాదిరిగానే నిర్దిష్ట సమయాల్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బెంగాల్ ముఖ్యమంత్రి.

Breaking మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్
Follow us on

Ban on liquor sales lifted: దేశంలో ఒక వైపు లాక్ డౌన్ కొనసాగింపుపై చర్చలు కొనసాగుతుంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మందుబాబులకు శుభవార్త వినిపించారు. నిత్యావసర వస్తువుల మాదిరిగానే నిర్దిష్ట సమయాల్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బెంగాల్ ముఖ్యమంత్రి. దీదీ తీసుకున్న ఈ నిర్ణయంతో బెంగాల్లో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. అయితే రాష్ట్ర ఆదాయం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో ఇకపై ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మద్యం పంపిణీ చేయడానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. బార్ల నుండి ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఆర్డర్లు తీసుకోవాలని.. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల మధ్య మద్యాన్ని డెలివరీ చేయాలని, అది కూడా రాష్ట్ర పోలీసుల ద్వారా మద్యం పంపిణీ జరపాలని ముఖ్యమంత్రి మమత బెనర్జీ నిర్ణయించారు. ఈ మేరకు బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.