పుల్వామా తరహాలో దాడి చేద్దామనుకున్నాడు… కానీ అంతలోనే..

శ్రీనగర్ : పుల్వామాలో ఫిబ్రవరి14న ఉగ్ర దాడిలో 40 మంది భారత సైనికులు మరణించిన సంగతి మరవకముందే.. దానికి ప్రతీకారంగా భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దాదాపు 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. అయితే పుల్వామా తరహాలో మరో ఆత్మహుతి దాడి చేయడానికి జైషే మహ్మద్ ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు తెలుస్తోంది. జైషే మొహమ్మద్‌ ఉగ్రసంస్థకు చెందిన రకీబ్‌ అహ్మద్‌ భద్రతాబలగాలపై ఆత్మాహుతి దాడి చేయాలని ప్రణాళిక రచించినట్లు వెల్లడించాడు. అయితే అనూహ్యంగా గతనెల 24న కుల్గామ్‌లోని […]

పుల్వామా తరహాలో దాడి చేద్దామనుకున్నాడు... కానీ అంతలోనే..

Edited By:

Updated on: Mar 03, 2019 | 9:40 AM

శ్రీనగర్ : పుల్వామాలో ఫిబ్రవరి14న ఉగ్ర దాడిలో 40 మంది భారత సైనికులు మరణించిన సంగతి మరవకముందే.. దానికి ప్రతీకారంగా భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దాదాపు 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. అయితే పుల్వామా తరహాలో మరో ఆత్మహుతి దాడి చేయడానికి జైషే మహ్మద్ ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు తెలుస్తోంది. జైషే మొహమ్మద్‌ ఉగ్రసంస్థకు చెందిన రకీబ్‌ అహ్మద్‌ భద్రతాబలగాలపై ఆత్మాహుతి దాడి చేయాలని ప్రణాళిక రచించినట్లు వెల్లడించాడు. అయితే అనూహ్యంగా గతనెల 24న కుల్గామ్‌లోని తురిగామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో రకీబ్‌ సహా ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. ‘మీరు ఈ వీడియోను చూసేలోగా నేను స్వర్గంలో ఉంటాను’ అని రకీబ్‌ మాట్లాడిన వీడియో శనివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో ఏ రకంగా ఆత్మాహుతిదాడి చేయబోతున్నానో అంటూ వీడియోలో రకీబ్‌ చెప్పినట్టు ఉంది. ఆదిల్‌ దార్, రకీబ్‌లకు సంబంధించిన వీడియోల మధ్య సారూప్యత ఉందన్నారు.