అసెంబ్లీలో బాబు గాలి తీసిన కొడాలి

|

Dec 17, 2019 | 3:52 PM

శంకుస్థాపనలు కూడా చేయని ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు అలవాటంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు ఏపీ మంత్రి కొడాలి నాని. రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో విభేదించిన కొడాలి నాని.. శంకుస్థాపనలు కూడా చేయని ప్రాజెక్టులను కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పదే పదే హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది తానేనని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది తానేనని చంద్రబాబు చెబుతూ వుంటారని, కానీ చంద్రబాబు […]

అసెంబ్లీలో బాబు గాలి తీసిన కొడాలి
Follow us on

శంకుస్థాపనలు కూడా చేయని ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు అలవాటంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు ఏపీ మంత్రి కొడాలి నాని. రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో విభేదించిన కొడాలి నాని.. శంకుస్థాపనలు కూడా చేయని ప్రాజెక్టులను కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

పదే పదే హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది తానేనని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది తానేనని చంద్రబాబు చెబుతూ వుంటారని, కానీ చంద్రబాబు పుట్టక ముందే హైదరాబాద్ దేశంలో అయిదో పెద్ద నగరమని కొడాలి నాని అన్నారు.

ఎక్స్‌ప్రెస్ హైవేకు శంకుస్థాపన కూడా చంద్రబాబు చేయలేదని, కానీ తన అకౌంట్‌లో వేసుకుంటున్నారని నాని ఎద్దేవా చేశారు. సభలో అబద్దాలు చెబుతున్న చంద్రబాబుకు తక్కువ సమయం కేటాయించాలని నాని స్పీకర్‌ను కోరారు.