తెలంగాణ బిజెపిలో ఫ్యాక్షన్ ఫైట్

|

Dec 04, 2019 | 7:42 PM

బీజేపీలో చిన్న చిన్న వివాదాలే నేతల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. పార్టీ ఒకటే అయినా దారులు వేరు కావటంతో అంతరం మరింత పెరుగుతోంది. ఎప్పుడో జరిగిన ఒక ఘటన , బీజేపీలో ముఖ్యనేతల మధ్య చిచ్చు పెట్టింది. ఆ ఇద్దరిలో ఒకరు కేంద్ర మంత్రి అయితే.. మరొకరు తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీకి వున్న ఏకైక ఎమ్మెల్యే. ఆ కథేంటో తెలియాలంటే రీడ్ దిస్ స్టోరీ.. ఒకరు కిషన్‌రెడ్డి, మరొకరు రాజాసింగ్‌. వీరిద్దరూ చాలాకాలంగా ఎడమొహం పెడమొహంగా […]

తెలంగాణ బిజెపిలో ఫ్యాక్షన్ ఫైట్
Follow us on

బీజేపీలో చిన్న చిన్న వివాదాలే నేతల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. పార్టీ ఒకటే అయినా దారులు వేరు కావటంతో అంతరం మరింత పెరుగుతోంది. ఎప్పుడో జరిగిన ఒక ఘటన , బీజేపీలో ముఖ్యనేతల మధ్య చిచ్చు పెట్టింది. ఆ ఇద్దరిలో ఒకరు కేంద్ర మంత్రి అయితే.. మరొకరు తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీకి వున్న ఏకైక ఎమ్మెల్యే. ఆ కథేంటో తెలియాలంటే రీడ్ దిస్ స్టోరీ..

ఒకరు కిషన్‌రెడ్డి, మరొకరు రాజాసింగ్‌. వీరిద్దరూ చాలాకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. రోజురోజుకీ దూరం పెరుగుతోంది. వీరిద్దరి మధ్య కొనసాగుతున్న విభేదాలు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి.

కిషన్‌రెడ్డికి, రాజాసింగ్‌కి అసలు గొడవెక్కడ వచ్చింది? ఎందుకొచ్చింది? అంటే బీఫ్‌ విషయంలో ఇద్దరి మధ్యా తేడాలు వచ్చాయి. గతంలో ఓయూ విద్యార్థులు బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. అది పెద్ద సంచలనమైంది. దానికి అనుకూలంగా కొందరు , ప్రతికూలంగా కొందరు మాట్లాడారు. ఓయూలో బీఫ్‌ ఫెస్టివల్‌పై కిషన్‌ రెడ్డి ఒకరకంగా మాట్లాడితే , రాజాసింగ్‌ మరోరకంగా మాట్లాడారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య గ్యాప్‌ పెరుగుతూ వస్తోంది.

ఓయూలో బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించరాదంటూ రాజాసింగ్‌ బలంగా వాదించారు. కిషన్‌రెడ్డి మాత్రం ఎవరైనా ఏమైనా తినే హక్కు ఉందని , తిండి విషయంలో ఆంక్షలు పెట్టడం పార్టీ లైన్‌ కాదన్నారు. ఇదే ఇద్దరి మధ్య అంతరానికి దారి తీసింది. గతంలో పార్టీలోకి రావాలని రాజాసింగ్‌ను ఆహ్వానించి కిషన్‌రెడ్డి, ఈ సంఘటన తర్వాత నుంచి దూరం పెడుతూ వస్తున్నారు. ఈ గ్యాప్‌వల్లే , కిషన్‌రెడ్డి గోషామహల్‌లో పర్యటించినా , తనకు ఆహ్వానం అందటం లేదంటున్నారు రాజాసింగ్‌.

తాను ఎప్పుడూ కిషన్‌రెడ్డి వద్దకు వెళ్లలేదని, ఆయన తనను పిలవలేదని చెబుతున్నారు. అవతలివారు ఎంతటి వారైనా తన సిద్ధాంతానికి అడ్డుపడితే ఊరుకునేది లేదంటున్నారు రాజాసింగ్‌ . మొదటి నుంచి నమ్మే సిద్ధాంతాన్ని తాను వదులుకోనంటున్నారు. హిందూ రక్షణకు పాటు పడుతున్న తాను, ఎవరైనా గోవును చంపి తింటామంటే ఊరుకునేది లేదంటున్నారు. అవసరమైతే పదవికి రాజీనామా చేసి మరీ ధర్మపరిరక్షణకోసం పునరంకితమవుతానంటున్నారు. ఈ అభిప్రాయభేదాలే , ఇద్దరు ముఖ్యనేతల మధ్య వైరాన్ని పెంచుతూ వచ్చాయి. ఒకే పార్టీ, ఒకే గొడుగు కింద ఉన్నా దూరదూరంగా ఉండిపోవడానికి దారితీశాయి. నేతలు ఇలా విడిపోతూ , వచ్చే రోజుల్లో పార్టీని అధికారం దిశగా ఎలా నడిపిస్తారో చూడాలి.