International Kidney Racket Busted at Hyderabad : విదేశీ కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. మానవ శరీరంలో అతి ముఖ్యమైన కిడ్నీలని కూరగాయల్లాగా కొనుగోలు చేసి అక్రమంగా అమ్ముకుంటున్న వైనం బైటపడింది. కరోనా టైమ్‌లోనూ కాసులకు కక్కుర్తి పడ్డ కొందరు. అమాయకులకు డబ్బు ఎరగా వేసిన కిడ్నీలు కాజేస్తున్నారు. కొట్టేసిన కిడ్నీలను నగరం నుంచి విదేశాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో కిడ్నీలు అమ్ముతున్న ముఠాను ట్రేస్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. పట్టుబడినవారిపై శ్రీలంకతో పాటు వివిధ రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్టు గుర్తించారు.
పేదరికాన్నిఆసరాగా తీసుకొని వారి కష్టాలనే తమకు పెట్టుబడిగా మలుచుకొని అతి చౌకగా నిరుపేదల నుంచి కిడ్నీలు కొనుగోలు చేస్తున్నారు. కిడ్నీ సమస్య వచ్చిన విదేశీ సంపన్నులకు వాటిని అధిక ధరకు విక్రయించడం ఇదే ఈ కిడ్నీ రాకెట్ వాణిజ్య రహస్యం. అది కూడా మన దేశంలో కాదు విదేశాల్లో వారి కిడ్నీలను అమ్ముకుంటున్నారు.