ఆ విషయాన్ని మైండ్‌లోంచి తీసేయ్యండి.. పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశం… గ్రేటర్ ఎన్నికలపై దిశానిర్దేశం

|

Nov 18, 2020 | 4:03 PM

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ లీడర్లకు దిశానిర్దేశం చేసిన గులాబీ బిగ్ బాస్ కే.చంద్రశేఖర్ రావు.. ఓ విషయాన్ని పూర్తిగా మెండ్ల నుంచి డిలీట్ చేయాలని పార్టీ వర్గాలను కోరారు. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటి ?

ఆ విషయాన్ని మైండ్‌లోంచి తీసేయ్యండి.. పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశం... గ్రేటర్ ఎన్నికలపై దిశానిర్దేశం
Follow us on

KCR asks to delete a matter from minds: గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు గులాబీ దళపతి కే.చంద్రశేఖర్ రావు. ఎన్నికల ప్రిపరేషన్‌లో విపక్షాల కంటే ముందున్న టీఆర్ఎస్ పార్టీ నేతలకు ఆయన బుధవారం దిశానిర్దేశం చేశారు. గ్రేటర్‌లో ఘన విజయం సాధించేలా కార్యాచరణను ఉపదేశించారు. అయితే, ఓ అంశాన్ని మాత్రం వెంటనే మైండ్‌లోంచి తీసెయ్యాలని ఖరాఖండీగా చెప్పేశారు కేసీఆర్.

తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు బుధవారం తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. గ్రేటర్‌ ఎన్నికల్లో తిరుగులేని గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేసీఆర్ పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు ప్రచార అస్త్రాలను నాయకులకు కేసీఆర్ వివరించారు.

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని మైండ్ నుండి తీసేయ్యాలని కేసిఆర్ ఆదేశించారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేసిన అభివృద్ధి, కరోనాతో పాటు వరదల సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులకు చెప్పారు. బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని, సోషల్ మీడియాతో సహా అన్ని వేదికల మీద బీజేపీ నేతలకు ధీటైన కౌంటర్లు ఇవ్వాలని గులాబీ బాస్ నిర్దేశించారు. మొత్తం 200మంది నాయకులతో సమావేశమైన కేసీఆర్.. 500 మందితో టీం ఏర్పాటు చేయ తలపెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి గల్లీలో, ప్రతి గడపకు టిఆర్ ఎస్ ప్రచారం చేరాలని పార్టీ నేతలను ఆయన ఆదేశించారు.

ALSO READ: హైదరాబాద్‌లో ఎలెక్షన్ కోడ్ స్టార్ట్.. వరద సాయానికి ఈసీ బ్రేక్

ALSO READ: వచ్చే ఏడు టీమిండియా బిజీ బిజీ.. క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే పండగ