కర్ణాటకలో పెరగుతున్న కరోనా కేసులు

కర్ణాటకలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. శుక్రవారం కొత్తగా 3,693 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది

కర్ణాటకలో పెరగుతున్న కరోనా కేసులు

Updated on: Jul 17, 2020 | 8:17 PM

కర్ణాటకలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. శుక్రవారం కొత్తగా 3,693 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో ఒక్క బెంగళూరులోనే 2,208 కేసులు నమోదయ్యాయి. దీంతో.. బెంగళూరులో యాక్టివ్ కేసుల సంఖ్య 20,623కి చేరింది. కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 115 మంది కరోనా వల్ల మరణించినట్లు ప్రభుత్వం పేర్కొంది. వీటిలో 75 మందికి పైగా మరణాలు బెంగళూరులోనే చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కర్ణాటకలో రికవరీ రేటు 37.66గా ఉండగా.. మరణాల రేటు 2.05కు పెరిగింది. ఇక ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 55,115కు చేరుకుంది. కరోనా బారిన పడిన 33,205 మంది యాక్టివ్ కేసులతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 20,757 మంది ఇళ్లకు చేరుకున్నారని ఆధికారులు వెల్లడించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us