కాయ్ రాజా కాయ్.. మెడికల్ పీజీ సీట్లలో దోపిడీ..

| Edited By:

Apr 18, 2019 | 5:25 PM

మెడికల్ పీజీ సీట్లలో దోపిడీ అవినీతి చాపకింద నీరులా సాగుతోంది. దేశ వ్యాప్తంగా ఎవరైనా.. ఎక్కడైనా.. అప్లై చేసుకోవచ్చన్న వెసలుబాటు కాలేజ్ యాజమాన్యాలకు అవకాశంగా మారింది. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే సీట్ పొందిన స్టూడెంట్స్‌చే అప్లై చేయిస్తున్న కాలేజ్ యాజమాన్యాలు.. వాటిని మేనేజ్‌మెంట్ కోటాగా మార్చి ఓపెన్ మార్కెట్‌లో అమ్మేస్తున్నాయి. మెడికల్ పీజీ సీట్లలో దోపిడీ అవినీతి చాపకింద నీరులా సాగుతోంది. దేశ వ్యాప్తంగా ఎవరైనా.. ఎక్కడైనా.. అప్లై చేసుకోవచ్చునన్న వెసులుబాటు కాలేజ్ యాజమాన్యాలకు అవకాశంగా మారింది. […]

కాయ్ రాజా కాయ్.. మెడికల్ పీజీ సీట్లలో దోపిడీ..
Follow us on

మెడికల్ పీజీ సీట్లలో దోపిడీ అవినీతి చాపకింద నీరులా సాగుతోంది. దేశ వ్యాప్తంగా ఎవరైనా.. ఎక్కడైనా.. అప్లై చేసుకోవచ్చన్న వెసలుబాటు కాలేజ్ యాజమాన్యాలకు అవకాశంగా మారింది. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే సీట్ పొందిన స్టూడెంట్స్‌చే అప్లై చేయిస్తున్న కాలేజ్ యాజమాన్యాలు.. వాటిని మేనేజ్‌మెంట్ కోటాగా మార్చి ఓపెన్ మార్కెట్‌లో అమ్మేస్తున్నాయి.

మెడికల్ పీజీ సీట్లలో దోపిడీ అవినీతి చాపకింద నీరులా సాగుతోంది. దేశ వ్యాప్తంగా ఎవరైనా.. ఎక్కడైనా.. అప్లై చేసుకోవచ్చునన్న వెసులుబాటు కాలేజ్ యాజమాన్యాలకు అవకాశంగా మారింది. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే సీట్లు పొందిన స్టూడెంట్స్‌చే అప్లై చేయిస్తున్న కాలేజ్ యాజమాన్యాలు.. వాటిని మేనేజ్‌మెంట్ కోటాగా మార్చి ఓపెన్ మార్కెట్‌లో అమ్మేస్తున్నాయి.

దీంతో.. స్థానిక విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. మెరిట్ ముసుగులో ఎంబీబీఎస్ సీట్లను బ్లాక్ చేసే బాగోతం.. పీజీ సీట్లకు పాకింది. ఏకంగా.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ యాజమాన్య కోటాకు.. కర్చీఫ్‌లు వేసేశారు. అయితే.. ఒక పీజీ సీటు రెండున్నర నుంచి మూడు కోట్ల వరకు అమ్మేస్తున్నారు. దీంతో.. మధ్య తరగతి తల్లిదండ్రులు ఈ అక్రమ దందాతో ఆందోళన చెందుతున్నారు.

టీవీ9 కథనాలకు స్పందించారు కాళోజి వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి. సీట్లను బ్లాక్ చేసి.. స్లైడింగ్ పాల్పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామంటోంది కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ. నీట్ విధానంలో దేశవ్యాప్తంగా ఉండే విద్యార్థులు తమకున్న కోటాలో వివిధ రాష్ట్రాల్లో యాజమాన్య కోటాగా బీ కేటగిరి పొందేందుకు వస్తున్నారంటున్నారు కాళోజీ వర్సిటీ వైస్ ఛాన్సలర్ కరుణాకర్ రెడ్డి. అయితే.. స్లైడింగ్‌కు పాల్పడేందుకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామంటున్నారు.

కౌన్సిలింగ్‌కు హాజరయ్యే వారు.. ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని హాజరు కావాలని ఆదేశిస్తున్నామంటున్నారు వీసీ. ఎట్టి పరిస్థితుల్లో కస్టోడియన్ సర్టిఫికేట్లను అనుమతించమంటున్నారు వీసీ.