జపాన్‌‌లో భారీ వర్షాలు.. ఇద్దరు మృతి.. 13 మంది గల్లంతు..!

|

Jul 05, 2020 | 3:34 PM

భారీ వర్షాలు, వరదలతో జపాన్ ప్రాంతం అతలాకుతలమైంది. దాదాపు 90 వేల మంది నిరాశ్రయులయ్యారు. నీటి మునిగిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జపాన్ వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మరో 80 వేల మంది ఇళ్లు విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరినట్లు తెలిపింది.

జపాన్‌‌లో భారీ వర్షాలు.. ఇద్దరు మృతి.. 13 మంది గల్లంతు..!
Follow us on

కరోనాతో ఇబ్బందులు పడుతున్న జనానికి భారీ వర్షాలు తోడయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో జపాన్ ప్రాంతం అతలాకుతలమైంది. దాదాపు 90 వేల మంది నిరాశ్రయులయ్యారు. నీటి మునిగిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జపాన్ వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మరో 80 వేల మంది ఇళ్లు విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరినట్లు తెలిపింది.

జపాన్ దక్షిణ ప్రాంతం భారీ వర్షాలకు పూర్తిగా నీట మునిగింది. వీటికి తోడు కొండచరియలు విరిగిపడుతుండటంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కుమా నది పొంగటంతో హితోయోషి పట్టణంలో ఇళ్లు, వాహనాలు అన్ని జలమయమయ్యాయి. ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందగా.. 13 మంది గల్లంతు అయ్యారు. కుమమాటో, కగోషిమా టౌన్లలోని 75 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 10 వేల మంది డిఫెన్స్ సిబ్బందితో రెస్క్యూ టీమ్ సహాయకచర్యలు చేపడుతోంది. జపాన్ రాజధానికి వెయ్యి కిలోమీటర్లు దూరంలో ఉన్న కుమామోటో ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జపాన్ ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది.