Jagan warning: అలా అయితే రాజీనామా చేయండి.. మంత్రులకు సీఎం వార్నింగ్

|

Mar 04, 2020 | 5:57 PM

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి... తన కేబినెట్ సహచరులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం చివరిలో జగన్ కీలక వ్యాఖ్యలు చేయడంతోపాటు మంత్రులకు హెచ్చరికలు జారీ చేశారు.

Jagan warning: అలా అయితే రాజీనామా చేయండి.. మంత్రులకు సీఎం వార్నింగ్
Follow us on

Jagan warned his cabinet colleagues: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి… తన కేబినెట్ సహచరులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం చివరిలో జగన్ కీలక వ్యాఖ్యలు చేయడంతోపాటు మంత్రులకు హెచ్చరికలు జారీ చేశారు. పరిపాలన, అధికారిక ఎజెండా ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి.. తన మంత్రివర్గ సహచరులతో రాజకీయాంశాలపై చర్చించారు.

కేబినెట్ భేటీ చివరిలో ముఖ్యమంత్రి జగన్ తన మంత్రివర్గ సహచరులతో కీలకాంశాలపై సమాలోచనలు జరిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం స్థానిక సంస్థల్లో విజయం సాధించిపెట్టే బాధ్యతలను సీఎం.. మంత్రులపై మోపారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను ఇంఛార్జి మంత్రులతోపాటు జిల్లా మంత్రులపై పెట్టారు సీఎం జగన్.

జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ఉన్న గ్రూపు తగాదాలు నేపథ్యంలో సరిదిద్దాలని మంత్రులకు సూచించారు జగన్. మద్యం, డబ్బు పంపిణీ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న సీఎం.. ప్రభుత్వ పనితీరు, పరిపాలన పనితీరుపై ప్రజల అభిప్రాయాలతో కూడిన సర్వే తన దగ్గర ఉందని మంత్రులకు చెప్పారు. ఎక్కడైనా ఫలితాల విషయంలో తేడా వస్తే మంత్రులు వెంటనే రాజీనామా చేయాల్సిందేనని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి.. కేబినెట్ మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు.

అంతటితో ఆగకుండా.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చే సమయంలోను స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించే ఫలితాలపై ఆధారపడి వుంటుందని జగన్ అన్నట్లు తెలుస్తోంది. తమ పరిధిలో విజయాలు సాధించలేని ఎమ్మెల్యేలకు మళ్ళీ టిక్కెట్లు ఇవ్వబోనని జగన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మార్చి 8వ తేదీ వరకు పార్టీ నేతలతో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికలకు సన్నద్ధం కావాలన్న సీఎం.. 9వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పినట్లు సమాచారం.

ఇదీ చదవండి: Jagan decision: ఇక అవన్నీ జగనన్న కాలనీలే..