ఎక్కడా..? ఏ ప్రధానికి కూడా ఇలా జరగలేదు..!

| Edited By:

Mar 02, 2019 | 10:53 AM

ఎలక్షన్ మిషన్ 2019పై ఏపీ సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీ ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు. అందుకే నమ్మక ద్రోహంపై రాష్ట్రమంతా నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. దేశలో ఏ ప్రధానికి వ్యతిరేకంగా ఇంతలా నిరసనలు జరగలేదన్నారు. మోడీ విఫల ప్రధానిగా మారారని చంద్రబాబు ఘాటుగా విమర్శలు చేశారు. తప్పుడు పనులు చేసి మాపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. మోడీకి దేశభక్తి కంటే రాజకీయ భక్తి ఎక్కువన్నారు. దేశభద్రత కన్నా.. రాజకీయ భద్రతే ఎక్కువన్నారు. రాజకీయం కోసం […]

ఎక్కడా..? ఏ ప్రధానికి కూడా ఇలా జరగలేదు..!
Follow us on

ఎలక్షన్ మిషన్ 2019పై ఏపీ సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీ ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు. అందుకే నమ్మక ద్రోహంపై రాష్ట్రమంతా నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. దేశలో ఏ ప్రధానికి వ్యతిరేకంగా ఇంతలా నిరసనలు జరగలేదన్నారు. మోడీ విఫల ప్రధానిగా మారారని చంద్రబాబు ఘాటుగా విమర్శలు చేశారు. తప్పుడు పనులు చేసి మాపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. మోడీకి దేశభక్తి కంటే రాజకీయ భక్తి ఎక్కువన్నారు. దేశభద్రత కన్నా.. రాజకీయ భద్రతే ఎక్కువన్నారు. రాజకీయం కోసం ఎంతకన్నా దిగజారే వ్యక్తి మోడీ అని అన్నారు సీఎం.

ఏపీ గాయాలపై కారం జల్లుతూ ప్రధాని ఆనందిస్తున్నారని, 7 వేల కోట్ల రాబడికి గండి కొట్టడం ద్రోహం కాదా అని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు. అప్పుడు స్కామాంధ్ర కావాలా..? స్కీమాంధ్రా కావాలా అన్న మోడీ.. ఇప్పుడు స్కామ్‌లు చేసేవారితో చేతులు కలిపారన్నారు. 5 ఏళ్లు దాటినా జగన్ పై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదన్నారు. అవినీతి పరులతో బీజేపీ అంటకాగుతోందన్నారు.