ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా.. నిత్యం ఎక్కడో ఓ దగ్గర ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని ప్రమాదవశాత్తు జరిగితే.. ఎక్కువగా వాహనదారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాల్ని తీసుకొచ్చింది. నిబంధనలను ఉల్లంఘిస్తే.. ఇకపై పెద్ద ఎత్తున చలాన్లు విధించడమే కాకుండా.. జైలు శిక్షలు కూడా విధించేలా వాహనచట్టాన్ని సవరించింది. అయితే ఈ క్రమంలో వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు.. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకు పక్కాగా పది సూత్రాలు పాటించాలని సలహాలిస్తున్నారు. అవేంటో చూద్దాం
1. టూవీలర్‌పై ప్రయాణించేటప్పుడు ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలి.
2. డ్రైవింగ్ చేసే సమయంలో సెల్‌ఫోన్లలో మాట్లాడటం, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినడం, వీడీయోలు చూడడం వంటివి చేయకూడదు. ఇది ప్రమాదకరమే కాకుండా. చట్ట విరుద్ధం కూడా..
3. కారు నడిపే సమయంలో సీటుబెల్ట్ కచ్చితంగా ధరించాలి.
4. రోడ్డుపై వెళ్తున్న సమయంలో.. ఎంత వేగంతో వెళ్లాలో సూచించే సైన్ బోర్డులను గమనిస్తూ ఉండాలి. అంతేకాదు.. అక్కడ సూచించిన వేగంకంటే ఎక్కువ స్పీడ్‌గా వెళ్లకూడదు.
5. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. సిగ్నల్స్ వద్ద జంప్ చేయడం నిబంధనలను అతిక్రమించడమే..
6. స్కూల్ జోన్లు, ఆస్పత్రుల వద్ద, జీబ్రా క్రాసింగ్స్, జంక్షన్ల వద్ద నెమ్మదిగా వెళ్లాలి.
7. మద్యం సేవించి ఎట్టిపరిస్థితుల్లోనూ డ్రైవింగ్ చేయకూడదు.
8. వాహనాల ఫిట్‌నెస్‌ను రెగ్యూలర్‌గా చెక్ చేయించుకోవాలి.
9. ఇతర వాహనాలకు మీ వాహనాలకు మధ్య కనీస గ్యాప్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
10. ఎదురుగా వస్తున్న వాహనదారులను.. ముందున్న వాహన దారులను గమనించడం ద్వారా.. కొన్ని ప్రమాదాలు నివారించవచ్చు.
పై పది సూత్రాలను పాటిస్తూ.. మీరు హాయిగా గమ్యాన్ని చేరుకోవడమే కాకుండా.. ఇతరులు కూడా సురక్షితంగా వారి వారి గమ్యాల్ని చేరుకుంటారు.