హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెడీ విద్యార్ధిని అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది. సోమవారం ఉదయం యూనివర్సిటీ క్యాంపస్‌గల హాస్టల్ బాత్రూమ్‌లొ ఆమె అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా గుర్తించారు. వెంటనే గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించిగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. యూనివర్సిటీ సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతి చెందిన విద్యార్ధిని దీపికా మహాపాత్రో(29) హెసీయులో పీహెచ్‌డీ చదువుతోంది. ఆమె గత కొంతకాలంగా మానసిక సమస్యతో పాటు మూర్చ వ్యాధితో బాధపడుతూ ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.