తెలుగు రాష్ట్రాల్లో భారీగా నామినేషన్లు

|

Mar 23, 2019 | 8:08 AM

హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకూ 220 నామినేన్లు దాఖలైనట్టు అధికారులు తెలిపారు. అత్యధికంగా నిజమాబాద్ నియోజకవర్గం నుంచి 54 నామినేషన్లు రాగా అత్యల్పంగా హైదరాబాద్‌లో ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. ఏపీలోనూ భారీగా నామినేష్లు దాఖలయ్యాయి. శుక్రవారం మంచి రోజు కావడంతో అన్ని పార్టీల అధినేతలు ముహూర్తం చూసుకుని మరీ నామినేషన్ దాఖలు చేశారు. కుప్పంలో చంద్రబాబు తరుపున టీడీపీ నేతలు నామినేషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తన […]

తెలుగు రాష్ట్రాల్లో భారీగా నామినేషన్లు
Follow us on

హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకూ 220 నామినేన్లు దాఖలైనట్టు అధికారులు తెలిపారు. అత్యధికంగా నిజమాబాద్ నియోజకవర్గం నుంచి 54 నామినేషన్లు రాగా అత్యల్పంగా హైదరాబాద్‌లో ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది.

ఏపీలోనూ భారీగా నామినేష్లు దాఖలయ్యాయి. శుక్రవారం మంచి రోజు కావడంతో అన్ని పార్టీల అధినేతలు ముహూర్తం చూసుకుని మరీ నామినేషన్ దాఖలు చేశారు. కుప్పంలో చంద్రబాబు తరుపున టీడీపీ నేతలు నామినేషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తన కుంటుంబ ఆస్తుల వివరాలను అధికారులు అందించారు.

వైసీపీ అధనేత జగన్ పులివెందుల అసెంబ్లీ సీటుకు నామినేషన్ దాఖలు చేారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్‌కు సమాధి దగ్గర నివాళులర్పించారు. సర్వమత ప్రార్ధనల అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. పులివెందులలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసగించారు.

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఉండవల్లిలో తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకుని నామినేషన్ వేశారు. తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ వెంట రాగా మంగళగిరిలో తన నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారులకు అందంచార.