తెలంగాణ ప్రభుత్వానికి ఆ అధికారం ఉంది: హైకోర్టు

|

Mar 09, 2019 | 10:11 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నగరాలు, పట్టణాల పరిధిని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాలను కలుపుకుని మరిన్ని నగరాలు, గ్రామాలను ఏర్పాటు చేసుకోవచ్చని న్యాయస్థానం చెప్పింది. మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఆనుకుని ఉన్న గ్రామాలను విలీనం చేసేందుకు మునిసిపల్ కార్పొరేషన్ చట్టంలో ప్రభుత్వం చేసిన సవరణలకు వ్యతిరేకంగా 120కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిని వ్యతిరేకించిన చాలా గ్రామాలు హైకోర్టును ఆశ్రయించాయి. అయితే హైకోర్టు వాటిని కొట్టేసింది. […]

తెలంగాణ ప్రభుత్వానికి ఆ అధికారం ఉంది: హైకోర్టు
Follow us on

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నగరాలు, పట్టణాల పరిధిని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాలను కలుపుకుని మరిన్ని నగరాలు, గ్రామాలను ఏర్పాటు చేసుకోవచ్చని న్యాయస్థానం చెప్పింది. మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఆనుకుని ఉన్న గ్రామాలను విలీనం చేసేందుకు మునిసిపల్ కార్పొరేషన్ చట్టంలో ప్రభుత్వం చేసిన సవరణలకు వ్యతిరేకంగా 120కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి.

దీనిని వ్యతిరేకించిన చాలా గ్రామాలు హైకోర్టును ఆశ్రయించాయి. అయితే హైకోర్టు వాటిని కొట్టేసింది. ఇటువంటి సవరణలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో రాష్ట్రంలో మరిన్ని కొత్త పట్టణాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.