
ఉండవల్లి ప్రజావేదిక కూల్చివేతకు లైన్ క్లియర్ అయింది. ప్రజావేదిక కూల్చ వద్దంటూ పిటిషనర్ శ్రీనివాస్ తరపు న్యాయవాది కృష్ణయ్య నిన్న అర్థరాత్రి హైకోర్టులో వేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. ప్రజావేదిక అక్రమ భవనం కావడంతో కూల్చివేత నిలుపుదలకు స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిందని న్యాయవాదులు చెబుతున్నారు. కాసేపట్లో దాదాపు ప్రజావేదిక పూర్తిగా నేలమట్టం కానుంది. ఇప్పటికే 60 శాతం కూల్చివేత ప్రక్రియ పూర్తైంది. ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అదనంగా మరో రెండు జేసీబీలను రప్పించారు. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ కూల్చివేతను పర్యవేక్షిస్తున్నారు.