తెలంగాణలో జోరు వానలు.. మత్తడి దూకుతున్న చెరువులు

|

Aug 13, 2020 | 12:04 PM

తెలంగాణలో జోరు వానలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

తెలంగాణలో జోరు వానలు.. మత్తడి దూకుతున్న చెరువులు
Follow us on

Heavy Rains in Telangana  : తెలంగాణలో జోరు వానలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాల్లోని గొలుసు కట్టు చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. చాలా చెరువులు మత్తడి దుంకుతున్నాయి. మిషన్‌ కాకతీయ పథకం కింద తెలంగాణలోని కాకతీయుల నాటి గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. చెరువుల మరమ్మతుతో వరదనీరు చేరి నిండుకుండలా కనిపిస్తున్నాయి. గ్రామాల్లోని చెరువులకు నీరు వచ్చి చేరుతుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లోబిజీగా మారిపోయారు.

ఇక తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారుగా వర్షం కురుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కడెం, ఎల్లంపల్లి, కొమురంభీం ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ప్రాణహిత నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది.  (మెడిగడ్డ) లక్ష్మీ బ్యారేజ్ ఇన్ ఫ్లో 3 లక్షల 76 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3లక్షల 99వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు 57 గేట్లను అధికారులు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం మెడిగడ్డ బ్యారేజ్‌లో 9.166 టీఎంసీల నీటి నిల్వ ఉంది.