తెలంగాణకు హెచ్చరిక ! రెండ్రోజుల పాటు..

| Edited By: Pardhasaradhi Peri

Jul 14, 2020 | 4:37 PM

తెలంగాణ రాష్ట్రంలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. రుతుపవనాలకు రెండు ఉపరితల ఆవర్తనాలు తోడవడంతో భారీ వర్షాలకు ఆస్కారం వుందని...

తెలంగాణకు హెచ్చరిక ! రెండ్రోజుల పాటు..
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. రుతుపవనాలకు రెండు ఉపరితల ఆవర్తనాలు తోడవడంతో భారీ వర్షాలకు ఆస్కారం వుందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం వెదర్ బులెటిన్ విడుదల చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.

జులై 14 సాయంత్రం నుంచి 16వ తేదీ మధ్యాహ్నం వరకు ఉపరితల ఆవర్తనాల ప్రభావం వుంటుందని వాతావరణ శాఖాధికారులు అంఛనా వేస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతం, గాంగేటిక్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఒకటి.. కర్నాటక మీదుగా మరోటి.. ఇలా రెండు భూ ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడం.. దానికి తోడు నైరుతీ రుతుపవనాలు చురుకుగా కదులుతూ వుండడం వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వారు వివరించారు.

ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్నసిరిసిల్లా, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి , జోగులాంబ జిల్లాలలో భారీవర్షాలు పడతాయని మెట్ డిపార్ట్‌మెంటు వెదర్ బులెటిన్‌లో పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ రాజారావు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.