అధిక ధరలకు మటన్ అమ్మితే జైలే.. జీహెచ్ఎంసీ వార్నింగ్

|

Apr 25, 2020 | 4:12 PM

జీహెచ్ఎంసీ పరిధిలోని మాంసం విక్రయదారులకు అధికారులు షాక్ ఇచ్చారు. అధిక ధరలకు మాంసం విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పలు మటన్ షాపులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే జైలుకు పంపుతామని వార్నింగ్ ఇచ్చారు.

అధిక ధరలకు మటన్ అమ్మితే జైలే.. జీహెచ్ఎంసీ వార్నింగ్
Follow us on

జీహెచ్ఎంసీ పరిధిలోని మాంసం విక్రయదారులకు అధికారులు షాక్ ఇచ్చారు. అధిక ధరలకు మాంసం విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పలు మటన్ షాపులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే జైలుకు పంపుతామని వార్నింగ్ ఇచ్చారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలోని పలు మటన్ షాపులపై జిహెచ్ఎంసి అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. మొత్తం 62 షాపులపై దాడులు నిర్వహిస్తే వాటిలో 52 షాపులకు కనీసం లైసెన్సులు కూడా లేవని అధికారులు గుర్తించారు. ఈ దుకాణాలలో అధిక ధరలకు మటన్ విక్రయిస్తున్నట్లు గుర్తించి, యజమానులపై కేసులు నమోదు చేశారు. కిలో మాంసం 700 రూపాయల కంటే ఎక్కువగా విక్రయిస్తే చర్యలు తప్పవని మటన్ షాప్ యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు.

కొన్ని దుకాణాలలో మాంసం కల్తీకి గురవుతున్న ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు యజమానులను హెచ్చరించారు. కల్తీ మాంసం విక్రయిస్తే జైలు పాలవుతారని వార్నింగ్ ఇచ్చారు. షాపులో కూడా భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యంగా ఆదివారాలు అధిక రద్దీ ఉండే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మటన్ షాప్ యజమానులకు అధికారులు సూచించారు.