శాస్త్రిపురం నోటీసులు వెనక్కి తీసుకున్న జీహెచ్ఎంసీ

|

Jul 06, 2020 | 8:51 PM

శాస్త్రిపురంలో పరిశ్రమల మూసివేతకు జారీ చేసిన నోటీసులు జీహెచ్ఎంసీ అధికారులు వెనక్కి తీసుకున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ నోటీసుల్లో స్పష్టమైన కారణాలు చూపలేదని హైకోర్టు తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో తమ నోటీసులను ఉపసంహరించుకున్నట్టు హై కోర్టుకు నివేదించారు జీహెచ్ఎంసీ అధికారులు.

శాస్త్రిపురం నోటీసులు వెనక్కి తీసుకున్న జీహెచ్ఎంసీ
Follow us on

శాస్త్రిపురంలో పరిశ్రమల మూసివేతకు జారీ చేసిన నోటీసులు జీహెచ్ఎంసీ అధికారులు వెనక్కి తీసుకున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ నోటీసుల్లో స్పష్టమైన కారణాలు చూపలేదని హైకోర్టు తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో తమ నోటీసులను ఉపసంహరించుకున్నట్టు హై కోర్టుకు నివేదించారు జీహెచ్ఎంసీ అధికారులు.

ఇటీవల నివాస ప్రాంతాల్లో నిర్వహిస్తూ ప్రజారోగ్యానికి కాలుష్య కారక ప్లాస్టిక్‌ పరిశ్రమలపై పీసీబీ అధికారులు కొరడా ఝుళిపించారు. నిబంధనలు పాటించకుండా నివాస ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకున్నారు. నగరంలోని కాటేదాన్‌, శాస్త్రి పురం తదితర ప్రాంతాల్లో ఉన్న 66 పరిశ్రమలను మూసివేశారు. ఒక్క సారిగా ఇన్ని పరిశ్రమలను మూసివేయడం సంచలనం కలిగించింది. జీహెచ్ఎంసీ నోటీసులను సవాల్ చేస్తూ దాఖలైన కేసులపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, పరిశ్రమల నిర్వాహకులు చట్ట విరుద్ధంగా నడప రాదని కోర్టు స్పష్టం చేసింది. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత సరైన కారణాలతో నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని సూచించింది హైకోర్టు.