హైద‌రాబాద్‌కు రూ. 550 కోట్లు: కేసీఆర్ ప్రకటన

భారీ నుంచి అతిభారీ వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్ మహానగరానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆర్థిక సాయం ప్రకటించారు. 112 ఏళ్ళ తర్వాత అంతటి స్థాయిలో కురిసిన...

హైద‌రాబాద్‌కు రూ. 550 కోట్లు: కేసీఆర్ ప్రకటన

Updated on: Oct 19, 2020 | 5:03 PM

Rs.550 Crores to Hyderabad city: భారీ నుంచి అతిభారీ వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్ మహానగరానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆర్థిక సాయం ప్రకటించారు. 112 ఏళ్ళ తర్వాత అంతటి స్థాయిలో కురిసిన అతిభారీ వర్షంతో మహానగరానికి వరద పోటెత్తిన సంగతి తెలిసిందే. తూర్పు, దక్షిణ హైదరాబాద్‌లో ఇప్పటికీ పలు కాలనీలు వరదనీటి మధ్యనే అవస్థల పాలవుతున్నాయి. వరద నీటితో దెబ్బతిన్న పేద‌ల‌కు సాయం అందించ‌డం కోసం మున్సిప‌ల్ శాఖ‌కు ప్ర‌భుత్వం రూ. 550 కోట్లు త‌క్ష‌ణం విడుద‌ల చేస్తుంద‌ని సీఎం కేసీఆర్ సోమవారం తెలిపారు.

వ‌ర‌ద నీటి ప్ర‌భావానికి గురైన హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప్ర‌తి ఇంటికి 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ ఆర్థిక సాయం మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచే ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించారు. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి ల‌క్ష రూపాయల చొప్పున, పాక్షికంగా దెబ్బ‌తిన్న ఇండ్ల‌కు 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు.

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల హైద‌రాబాద్ న‌గ‌రంలోని లోత‌ట్టు ప్రాంతాల్లోని ప్ర‌జలు ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కు గుర‌య్యార‌ని, వారిని ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రకటించారు. వ‌ర‌ద నీటిలో మునిగిన ప్రాంతాల్లోని ఇళ్ల‌ల్లో నివ‌సిస్తున్న వారు ఎంతో న‌ష్ట‌పోయార‌ని, ఇళ్ల‌లోకి నీళ్లు రావ‌డం వ‌ల్ల బియ్యం స‌హా ఇత‌ర ఆహార ప‌దార్థాలు త‌డిసిపోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దెబ్బ‌తిన్న ర‌హ‌దారులు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి, మ‌ళ్లీ మ‌మూలు జీవ‌న ప‌రిస్థితులు నెల‌కొనేలా చూడాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.

Also read:  ఏపీలో మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ… ఈసారి టాపిక్ ఇదే!

Also read: బహిరంగచర్చకు రెడీ.. బండికి హరీశ్ సవాల్

Also read: కిస్తులు కట్టిన వారికి త్వరలో మోదీ సర్కార్ శుభవార్త!

Also read: మళ్ళీ వర్షగండం… భయపడొద్దన్న కేటీఆర్

Also read: త్వరలో తెలంగాణకు కేంద్ర బ‌ృందం.. వెల్లడించిన కిషన్‌రెడ్డి