Breaking, Fire at Shatabdi Express : ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌ వెళ్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో పెద్ద ఎత్తున మంటలు, పలు బోగీలు దగ్ధం

Fire at Delhi-Dehradun Shatabdi Express : ఉత్తరాఖండ్‌లో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌ వెళ్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో పలు బోగీలు..

Breaking,  Fire at Shatabdi Express : ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌ వెళ్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో పెద్ద ఎత్తున మంటలు, పలు బోగీలు దగ్ధం
Fire In Shatabdi Express

Updated on: Mar 13, 2021 | 3:22 PM

Fire at Delhi-Dehradun Shatabdi Express : ఉత్తరాఖండ్‌లో శనివారం మధ్యాహ్నం ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌ వెళ్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సీ4 కంపార్ట్ మెంట్లో షార్ట్ సర్కూట్ కారణంగా చెలరేగిన మంటల్లో పలు బోగీలు దగ్ధమయ్యాయి. ప్రయాణికులు వెంటనే కిందకు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. ఉత్తరాఖండ్‌ లోని కన్స్‌రావ్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. హరిద్వార్‌కు సమీపం లోని రాజాజీ నేషనల్‌ పార్క్‌ సమీపం లోకి రాగానే రైలులో మంటలు చెలరేగినట్టు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. రైల్వే శాఖ అధికారులకు సమాచారం తెలియగానే అక్కడికి చేరుకున్నారు .

ప్రయాణికులను రిలీఫ్‌ ట్రైన్ ‌లో అక్కడి నుంచి దగ్గరి స్టేషన్‌కు తరలించారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటల్లో చాలా బోగీలు దగ్ధమయ్యాయి. దీంతో ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. రైల్వేశాఖ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఇంజన్‌తో పాటు పలు బోగీలు ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యాయి.

Read also : Tulip flowers : విరబూస్తోన్న తులిప్‌ పూలు పర్యాటకుల మనసు దోచేస్తున్నాయ్.. నవ వసంతానికి స్వాగతం పలుకుతున్నాయ్