రాహుల్‌పై కామెంట్స్.. సుబ్రహ్మణ్య స్వామిపై కేసు నమోదు

| Edited By:

Jul 09, 2019 | 1:20 AM

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిపై కేసులు నమోదయ్యాయి. రాహుల్ గాంధీ కొకైన్ తీసుకుంటారంటూ సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. దేశ వ్యాప్తంగా పలుచోట్ల కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. వెంటనే రాహుల్ గాంధీకి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రాహుల్‌పై సుబ్రహ్మణ్య స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై.. ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పూర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పవన్ అగర్వాల్ […]

రాహుల్‌పై కామెంట్స్.. సుబ్రహ్మణ్య స్వామిపై కేసు నమోదు
Follow us on

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిపై కేసులు నమోదయ్యాయి. రాహుల్ గాంధీ కొకైన్ తీసుకుంటారంటూ సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. దేశ వ్యాప్తంగా పలుచోట్ల కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. వెంటనే రాహుల్ గాంధీకి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

రాహుల్‌పై సుబ్రహ్మణ్య స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై.. ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పూర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పవన్ అగర్వాల్ స్థానిక ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పవన్ అగర్వాల్ ఫిర్యాదు మేరుకు పత్యల్‌గావ్ పీఎస్‌లో సుబ్రహ్మణ్య స్వామిపై కేసు నమోదు చేశారు.