హఫీజ్‌, జకీర్‌ల ఆస్తుల జప్తునకు ఈడీ సన్నాహాలు

| Edited By:

Mar 02, 2019 | 7:49 AM

ఢిల్లీ: లష్కరే తోయిబా ఉగ్రవాద నాయకుడు హఫీజ్ సయీద్, ఇస్లామిక్ మతబోధకుడు జకీర్ నాయక్ కు చెందిన ఆస్తులను సీజ్ చేసేందుకు ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ రంగం సిద్ధం చేసింది. జమ్ముకశ్మీర్ లోని 14 ఆస్తులు లష్కరే తోయిబా ఉగ్రవాద ముఠానాయకుడు హఫీజ్‌ సయీద్‌కు చెందినవిగా భావిస్తున్నారు. వీటిలో పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద ఇళ్లు, ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీనగర్ కు చెందిన వ్యాపారవేత్త జహోర్ అహ్మద్ షా వటాలీకి బినామీగా ఉన్నట్లు తెలిపారు. ఉగ్రవాదానికి […]

హఫీజ్‌, జకీర్‌ల ఆస్తుల జప్తునకు ఈడీ సన్నాహాలు
Follow us on

ఢిల్లీ: లష్కరే తోయిబా ఉగ్రవాద నాయకుడు హఫీజ్ సయీద్, ఇస్లామిక్ మతబోధకుడు జకీర్ నాయక్ కు చెందిన ఆస్తులను సీజ్ చేసేందుకు ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ రంగం సిద్ధం చేసింది. జమ్ముకశ్మీర్ లోని 14 ఆస్తులు లష్కరే తోయిబా ఉగ్రవాద ముఠానాయకుడు హఫీజ్‌ సయీద్‌కు చెందినవిగా భావిస్తున్నారు. వీటిలో పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద ఇళ్లు, ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీనగర్ కు చెందిన వ్యాపారవేత్త జహోర్ అహ్మద్ షా వటాలీకి బినామీగా ఉన్నట్లు తెలిపారు. ఉగ్రవాదానికి నిధులందిస్తున్న అభియోగంపై వటాలీని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గత ఏడాది ఆగస్టులో అరెస్టు చేసింది. వివాదాస్పద ఇస్లామిక్‌ మత బోధకుడు జకీర్‌ నాయక్‌కు చెందిన రూ. 51 కోట్ల ఆస్తులను గుర్తించిన ఈడీ వాటిని జప్తు చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది.