ఢిల్లీ విమానాశ్రయంలో 8 మంది మలేసియన్ల పట్టివేత

| Edited By: Anil kumar poka

Apr 05, 2020 | 7:14 PM

ఇండియా నుంచి మలేసియాకు పారిపోబోతున్న 8 మంది మలేసియన్లను ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు. వీరంతా ఇటీవల ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ ఈవెంట్ కు హాజరైనవారని తెలుస్తోంది.

ఢిల్లీ విమానాశ్రయంలో 8 మంది మలేసియన్ల పట్టివేత
Follow us on

ఇండియా నుంచి మలేసియాకు పారిపోబోతున్న 8 మంది మలేసియన్లను ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు. వీరంతా ఇటీవల ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ ఈవెంట్ కు హాజరైనవారని తెలుస్తోంది. మలేసియాకు చెందిన మలింబో ఎయిర్ వేస్ విమానం ఎక్కబోతూ ఈ వ్యక్తులు పట్టుబడ్డారు. ఢిల్లీ నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో వీరు ఇంతకాలం దాక్కున్నారని, ఈ దేశం వదిలి తమ దేశానికి పారిపోయేందుకు పకడ్బందీ ప్లాన్ వేసుకుని ఆదివారం ఈ విమానాశ్రయానికి చేరుకున్నారని తెలుస్తోంది. పైగా అధికారులు అడిగిన ప్రశ్నలకు ఈ వ్యక్తులు సరైన సమాధానం కూడా ఇవ్వలేదట. ఈ ఎనిమిది మందిని ఎయిర్ పోర్టు అధికారులు పోలీసులకు అప్పగించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వీరిని విచారించనున్నారు. మలేసియా, ఇండోనేసియా సహా వివిధ దేశాలకు చెందిన సుమారు రెండు వేల మంది నిజాముద్దీన్ ప్రార్థనా కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమాలతో లింకు ఉన్న కరోనా కన్ఫార్మ్ కేసులు 301 కి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా దేశంలో కరోనా కేసులు పెరగడానికి నిజాముద్దీన్ ఈవెంట్ కి హాజరైనవారే కారకులని యూపీలో ఓ వ్యక్తి ఆరోపించగా అతడిని దుండగులు హత్య చేశారు.