సంపత్‌ నంది వెబ్‌సిరీస్‌లో ఈషా రెబ్బా !

|

Aug 12, 2020 | 8:52 PM

ప్ర‌స్తుతం క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో థియేట‌ర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.  ఈ నేపథ్యంలో మేక‌ర్స్ డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌పై ఫోక‌స్ పెట్టారు.

సంపత్‌ నంది వెబ్‌సిరీస్‌లో ఈషా రెబ్బా !
Follow us on

ప్ర‌స్తుతం క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో థియేట‌ర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.  ఈ నేపథ్యంలో మేక‌ర్స్ డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌పై ఫోక‌స్ పెట్టారు. ప‌లువురు బ‌డా డైరెక్ట‌ర్లు సైతం ఈ దోవ‌నే ఎన్నుకుంటున్నారు. తాజాగా డైరెక్టర్ సంప‌త్ నంది‌ తన సొంత నిర్మాణ సంస్థలో ఓ వెబ్‌సిరీస్ తెర‌కెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్ కంప్లీట్ చేశాడట. ఈషా రెబ్బ లీడ్‌ రోల్‌లో నటించనున్న ఈ చిత్రం రాత్రివేళ హైదరాబాద్‌ జీవనశైలిని ప్రతిబింబించే విధంగా ఉండ‌నుందని తెలుస్తోంది.

అయితే ఈషా రెబ్బ ప్రజంట్ హిందీలో సూపర్‌హిట్ మూవీ ‘లస్ట్‌ స్టోరీస్’‌ రీమేక్‌ వెబ్‌సిరీస్‌తో బిజీగా ఉంది. మ‌రి ఈషా వ‌చ్చే వ‌రకు ఆగుతారా.. మ‌రో హీరోయిన్‌తో ముందుకు వెళ్తారో తెలియాలంటే మ‌రికొంత‌కాలం వెయిట్ చేయాల్సిందే.

 

Also Read : “12 శాతం వ‌డ్డీతో ఆ జీతాలు చెల్లించండి : ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ జీవోలు ర‌ద్దు”