ED speeded up Note for Vote case investigation: అయిదేళ్ళ క్రితం సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. తాజా దర్యాప్తులో అత్యంత కీలకాంశాలు వెలుగు చూసినట్లు సమాచారం. కేసులో కీలక నిందితుడైన జెరూసలేం మత్తయ్య నుంచి ఈడీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిల పాత్రపై మత్తయ్య నుంచి అత్యంత కీలక వాంగ్మూలాన్ని ఈడీ దర్యాప్తు బృందం సేకరించినట్లు తెలుస్తోంది.
మళ్ళీ తెరపైకి చేరింది ఓటుకు నోటు కేసు. ఓటుకు నోటు కేసు దర్యాప్తును ఈడీ వేగవంతం చేసింది. కేసులో కీలక నిందితునిగా భావిస్తున్న జెరూసలేం మత్తయ్య వాగ్మూలాన్ని ఈడీ దర్యాప్తు బృందం రికార్డు చేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర ఉందని మత్తయ్య వాంగ్మూలమిచ్చినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ సభ్యుడు స్టీఫెన్‌సన్ టీడీపీకి అనుకూలంగా ఓటు వేయడం కోసం డీల్ మాట్లాడినట్లు మత్తయ్య అంగీకరించినట్లు సమాచారం.
డీల్ సెట్ చేసినందుకు 50 లక్షలు ఆఫర్ ఇచ్చారని మత్తయ్య ఈడీకి వివరించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు మార్గ దర్శకత్వంలోనే రేవంత్ రెడ్డితో కలిసి స్టీఫెన్‌సన్‌ను ప్రలోభ పెట్టినట్లు మత్తయ్య విచారణలో భాగంగా అంగీకరించినట్లు సమాచారం. ఏసీబీ రైడ్ తర్వాత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ సలహా మేరకు ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకున్నట్లు మత్తయ్య ఈడీ దర్యాప్తు బృందానికి తెలిపినట్లు అభీఙ్ఞ వర్గాల భోగట్టా.
ALSO READ: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. విగ్రహాల విధ్వంసకులను దేవుడే శిక్షిస్తాడన్న ముఖ్యమంత్రి
ALSO READ: ఆ మాట ఎక్కడా వినిపించొద్దు.. ఉన్నతాధికారులకు ఏపీ సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..