ఈవీఎంలు సరిచేశాం.. ఓటు హక్కును వినియోగించుకోండి: ద్వివేది
రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ఏపీ ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. సిబ్బంది అవగాహన లోపంతోనే కొన్ని ఈవీఎంలు మొరాయించాయని ఆయన చెప్పారు. 45,920 ఈవీఎంలలో 102 మాత్రమే మొరాయించాయని.. వాటన్నింటిని సరిచేశామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం అన్ని ఈవీఎంలు పనిచేస్తున్నాయని ద్వివేది పేర్కొన్నారు. పోలింగ్ సమయాన్ని పెంచాల్సిన అవసరం లేదని.. ప్రజలు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.