“కరోనా” నువ్వు బతుకు.. అంటూ వర్మ మెసెజ్..! ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

| Edited By:

Mar 04, 2020 | 6:28 PM

ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు.. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వార్నింగ్ ఇచ్చారు. అది కూడా తన ట్విట్టర్‌ వేదికగా.. ఆయన చేసిన ట్వీట్స్‌ను చూసిన నెటిజన్లు.. తెగ కామెంట్లు చేస్తున్నారు. కరోనా.. నువ్వు మమ్మల్ని చంపేస్తే..

కరోనా నువ్వు బతుకు.. అంటూ వర్మ మెసెజ్..! ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!
Follow us on

ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు.. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వార్నింగ్ ఇచ్చారు. అది కూడా తన ట్విట్టర్‌ వేదికగా.. ఆయన చేసిన ట్వీట్స్‌ను చూసిన నెటిజన్లు.. తెగ కామెంట్లు చేస్తున్నారు. కరోనా.. నువ్వు మమ్మల్ని చంపేస్తే.. నువ్వు కూడా చస్తావన్న విషయాన్ని మర్చిపోకంటూ.. ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కే వార్నింగ్‌ ట్వీట్ ఇచ్చారు రాంగోపాల్ వర్మ.

ట్వీట్‌లో.. ” డియర్ కరోనా వైరస్.. బుద్దిలేకుండా అందర్నీ చంపుకుంటూ వెళ్లే బదులు.. నువ్వు కూడా చనిపోతవన్న విషయాన్ని తెలుసుకో అంటూ పేర్కొన్నారు. ఎందుకంటే నువ్వు కూడా ఓ పారసైట్‌వే. నా మాటపై నమ్మకం లేకపోతే.. నువ్వు వెంటనే వైరాలజీలో క్రాష్ కోర్స్ తీసుకోమంటూ ఆ వైరస్‌కు సలహా ఇచ్చారు. నేను నీకు రిక్వెస్ట్ చేస్తున్నదేంటంటే.. నువ్వు బతుకు.. మమ్మల్ని బతకనివ్వూ అంటూ.. ట్విట్టర్‌లో ఆసక్తికంగా పోస్ట్ చేశారు.

అయితే వర్మ చేసిన ఈ ట్వీట్స్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వర్మ గారు.. మీకులా కరోనా వైరస్‌కు ట్విట్టర్‌ అకౌంట్ లేదు.. సో డైరక్ట్‌ ఆస్పత్రికి వెళ్లి.. ఆ వైరస్‌కు వార్నింగ్ ఇవ్వండంటూ.. వర్మకు ఫన్నీ రిప్లైస్ ఇస్తున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో.. వర్మ బుధవారం ఉదయం కూడా ట్వీట్స్ చేశారు. మనం ఇన్నాళ్లు ఎన్నో చైనీస్ వస్తువులను ఉపయోగించాం.. ఇప్పుడు చావు కూడా చైనాదేనా అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. కాగా.. చైనాలోని వుహాన్‌లో ఈ కరోనా మహమ్మారి పుట్టిందన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ కరోనా ఎఫెక్ట్‌ కారణంగా మూడు వేలమందికి పైగా మరణించారు.