ఖమ్మం జిల్లాలో దారుణం.. గ్రామ ఉప సర్పంచ్ కుటుంబం ఆత్మహత్యయత్నం.. అసలు కారణం అదేనా..?

చేసిన అప్పులు తీర్చలేక గ్రామ ఉపసర్పంచ్‌ తన కుటుంబంతోసహా ఆత్మహత్యకు యత్నించాడు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం ఒడియాతండాలో శనివారం ఈ ఘటన జరిగింది.

ఖమ్మం జిల్లాలో దారుణం.. గ్రామ ఉప సర్పంచ్ కుటుంబం ఆత్మహత్యయత్నం.. అసలు కారణం అదేనా..?
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 06, 2021 | 5:21 PM

Deputy Sarpanch family Suicide attempt : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ప్రజా ప్రతినిధి కుటుంబం బలవన్మరణానికి ప్రయత్నించింది. చేసిన అప్పులు తీర్చలేక గ్రామ ఉపసర్పంచ్‌ తన కుటుంబంతోసహా ఆత్మహత్యకు యత్నించాడు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం ఒడియాతండాలో శనివారం ఈ ఘటన జరిగింది. ఒడియాతండా ఉప సర్పంచ్‌ బాబూరావు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. తన అవసరాల కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. చేసిన అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి పెరిగింది. డబ్బుల వచ్చే మార్గం కనిపించక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు బాబురావు. దీంతో తీవ్ర మనస్తాపంతో బాబూరావు దంపతులు మధ్యాహ్నం ఇంట్లో ఇద్దరు చిన్నారులకు క్రిమిసంహారక మందు తాగించి తామూ సేవించారు. దీంతో నలుగురు అపస్మారకస్థితికి చేరుకున్నారు.

ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన ఆ కుటుంబాన్ని చికిత్స నిమిత్తం ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వారిని తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి… డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ జబర్దస్త్ ఆర్టిస్ట్ .. ఫుల్లుగా మద్యం సేవించి పోలీసులకు చిక్కిన కమెడియన్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!