బ్రేకింగ్: ఉన్నావ్ కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు జీవితఖైదు!

|

Dec 20, 2019 | 2:29 PM

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ రేప్ కేసులో దోషిగా ప్రూవ్ అయిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అంతేకాకుండా బాధితురాలి కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. నాలుగు రోజుల క్రితం ఈ కేసులో కుల్దీప్ సెంగార్‌ను కోర్టు దోషిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఉన్నావ్‌లో 2017 సంవత్సరంలో ఓ మైనర్ బాలిక  ఉద్యోగం కోసం స్థానిక ఎమ్మెల్యే  కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ ఇంటికి వెళ్లగా ఆమెపై అత్యాచారం […]

బ్రేకింగ్: ఉన్నావ్ కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు జీవితఖైదు!
Follow us on

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ రేప్ కేసులో దోషిగా ప్రూవ్ అయిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అంతేకాకుండా బాధితురాలి కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. నాలుగు రోజుల క్రితం ఈ కేసులో కుల్దీప్ సెంగార్‌ను కోర్టు దోషిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే.

ఉన్నావ్‌లో 2017 సంవత్సరంలో ఓ మైనర్ బాలిక  ఉద్యోగం కోసం స్థానిక ఎమ్మెల్యే  కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ ఇంటికి వెళ్లగా ఆమెపై అత్యాచారం జరిగింది. ఆ తర్వాత కూడా కొందరు వ్యక్తలు ఆమెను కిడ్నాాప్ చేసి పలుమార్లు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్యే తన బలం, బలగంతో బాధితురాలి ఫ్యామిలీపై దాడికి పాల్పడ్డాడు. ఆమె తండ్రిని తీవ్రంగా గాయపర్చడంతో పాటు అక్రమ ఆయుధాల కేసును పెట్టి అరెస్ట్ చేయించారు. పోలీస్ కస్టడీలో ఉండగానే ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.   తనను, తన కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తుండటంతో,  తీవ్ర భావోద్వేగానికి గురైన బాధితురాలు  సీఎం ఇంటి ముందు సుసైడ్ అటెమ్ట్ చేసింది. ఆ తర్వాత ఈ  కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే  కుల్దీప్‌ సింగ్‌ను అరెస్టు చేసినా కూడా బాధితురాలికి కష్టాలు తప్పలేదు. ఆమె కారులో ప్రయాణిస్తుండగా లారీతో ఢీకొట్టించారు. ఈ ప్రమాదంలో ఆమె బంధువులు ఇద్దరు చనిపోగా, బాధితురాలు పక్షాన వాదనలు వినిపిస్తోన్న న్యాయవాది గాయపడ్డారు.