పాకిస్థాన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా పాక్‌లో సింధ్ ప్రావిన్స్ ,పంజాబ్ ప్రావిన్స్‌లలోనే కేసులు ఎక్కువగా నమోదవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా బుధవారం నమోదైన కేసులు చూస్తే.. పాక్ తీరును అద్దం పడుతోంది. ఒక్కరోజే అక్కడ 26 మంది కరోనా మహమ్మారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే పాక్ మంత్రుల వ్యవహారం చూస్తే షాక్ తినాల్సిందే. తాజాగా పాక్ ప్రధాని ఇతర దేశాలతో పోల్చితే మన దగ్గర చాలా తక్కువ అంటూ కొట్టిపారేస్తే.. ఇక పాక్ జాతీయ రక్షణ విభాగ ప్రత్యేక కార్యదర్శి మోయీద్ యూసుఫ్ మాటలు ఖంగుతినేలా చేస్తున్నాయి. కరోనా బారినపడ్డ వారి మరణాల గురించి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కేవలం 44 మంది మాత్రమే ప్రాణాపాయ
స్థితిలో ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. ఇది మిగతా దేశాలతో పోల్చితే.. పాక్‌లో తక్కువ చనిపోతున్నారంటూ చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాలన్నింటిలో.. దాదాపు మరణాల రేటు.. 7.00 శాతంగా ఉందని.. అలా చూస్తే.. పాక్‌లో కేవలం 2.1 మాత్రమేనంటూ వెల్లడించారు.
అయితే మంత్రి మాటలకు.. పాక్‌లో పెరుగుతున్న కేసులు చూస్తే.. పొంతన కుదరట్లేదు. ఇప్పటికే దేశంలో పదిహేను వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో 346 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ పెరిగిన కేసుల్లో అత్యధికంగా పంజాబ్ ప్రావిన్స్‌లో 6,061 కేసులు నమోదవ్వగా, సింధ్ ప్రావిన్స్ ప్రాంతంలో 5,695 కేసులు నమోదయ్యాయి. ఇక ఖైబర్ పంక్తుంఖ్వాలో 2,313, బలూచిస్తాన్‌లో 978, గిల్జిత్ బలిస్తాన్‌లో 333, ఇస్లామాబాద్‌లో 313 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ ప్రాంతాల్లోనే కేసులు నమోదవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కరోనా సోకిన పేషెంట్లను భారత్ సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం అనుమానాలకు తావిస్తోంది.