ప్రధాని మోదీసహా వీవీఐపీల డేటా హ్యాక్ !

| Edited By:

Sep 18, 2020 | 2:15 PM

రాష్ట్రపతి, మోదీతో సహా దాదాపు 10,000 మంది ప్రముఖులపై చైనా గూఢచర్యానికి పాల్పడుతుందన్న నేపథ్యంలో తాజాగా మరో సంచలనమైన వార్త వెలుగులోకి వచ్చింది. నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్ కు చెందిన కంప్యూటర్లు హ్యాక్ కు గురైనట్టు గుర్తించారు.

ప్రధాని మోదీసహా వీవీఐపీల డేటా హ్యాక్ !
Follow us on

రాష్ట్రపతి, మోదీతో సహా దాదాపు 10,000 మంది ప్రముఖులపై చైనా గూఢచర్యానికి పాల్పడుతుందన్న నేపథ్యంలో తాజాగా మరో సంచలనమైన వార్త వెలుగులోకి వచ్చింది. నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్ కు చెందిన కంప్యూటర్లు హ్యాక్ కు గురైనట్టు గుర్తించారు. ఈ సమాచారం అందగానే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు.. కేసు నమోదు చేశారు.

నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్ కు చెందిన కంప్యూటర్లు హ్యాక్ కు గురయ్యాయి. ఇదే విషయాన్ని ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ లోని ఉన్నతాధికారులు తెలిపారు. ఇందులో దేశ భద్రతకు సంబంధించిన అంశాలు, ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు సంబంధించి పూర్తి సమాచారం అందుబాటులో ఉంది.

 

అయితే ఈ హ్యాకింగ్ అంతా కూడా బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ చేసినట్లు పోలీసులు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్ కు చెందిన ఉద్యోగులకు ఓ మెయిల్ వచ్చిందని, దాంట్లోని లింక్‌ను ఓపెన్ చేయగానే కంప్యూటర్ హ్యాక్ అయ్యిందని అధికారులు తెలిపారు.

బెంగళూరుకు చెందిన అమెరికాకు కంపెనీ నుంచి ఆ ఈ మెయిల్ వచ్చినట్టు గుర్తించారు. దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ క్రైమ్ స్పెషల్ బ్రాంచ్ పోలసీులు.. దర్యాప్తు మొదలుపెట్టారు.

ఇప్పటికే మనదేశంపై చైనా ప్రత్యేక నిఘా పెట్టింది. ఈ పనిని చైనా ప్రభుత్వ గూఢచర్య వర్గాలు నేరుగా చేస్తున్నాయి. ప్రభుత్వ నిఘా పరిమితం. కానీ ప్రైవేట్‌ కంపెనీ జెన్‌హువా డేటా ఇతర దేశాల్లోకి చొరబడుతోంది. విద్యావేత్తలు, అధికారులు, ఇతర ప్రముఖుల నుంచి ప్రధాని, రాష్ట్రపతి వరకు అందరిపైనా దృష్టపెట్టింది.

భారత్‌లోని మొత్తం 10వేల మందిపై జెన్‌హువా నిఘాపెట్టింది. ప్రపంచంలో మొత్తం 24 లక్షల మంది సోషల్‌ మీడియా అకౌంట్లలోకి ఈ సంస్థ తొంగిచూస్తోంది. జెన్‌హువా జాబితాలో ఉన్నవారి పేర్లు ఇప్పటికే బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో డేటా హ్యాక్ అయిందన్న సమాచారం రాగానే ఢిల్లీ పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు.