జెఎన్‌యు విధ్వంసం వామపక్షాల పనే: తేల్చిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్

|

Jan 10, 2020 | 6:02 PM

జెఎన్‌యులో విధ్వంసానికి పాల్పడిన వారెవరో ఢిల్లీ పోలీసులు తేల్చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో జెఎన్‌యుఎస్‌యు నేతలు ఆయిషి ఘోష్, ప్రియా రంజన్, చున్ చున్ కుమార్ తదితరులే విధ్వంసానికి పాల్పడినట్లు తేల్చి, వారిపై కేసులు నమోదు చేశారు. ఈ విధ్వంసానికి మొత్తం తొమ్మిది మంది పాల్పడినట్లు తేల్చారు. వారందరి ఫోటోలను రిలీజ్ చేశారు. ఆయిషీ, చున్ చున్, ప్రియారంజన్‌లతో పాటు సుచేత, యోగేంద్ర, వికాస్‌ పటేల్, పంకజ్‌కుమార్, డోలన్, మాలినీలు ఈ విధ్వంసానికి పాల్పడినట్లు వారు చెబుతున్నారు. […]

జెఎన్‌యు విధ్వంసం వామపక్షాల పనే: తేల్చిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్
Follow us on

జెఎన్‌యులో విధ్వంసానికి పాల్పడిన వారెవరో ఢిల్లీ పోలీసులు తేల్చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో జెఎన్‌యుఎస్‌యు నేతలు ఆయిషి ఘోష్, ప్రియా రంజన్, చున్ చున్ కుమార్ తదితరులే విధ్వంసానికి పాల్పడినట్లు తేల్చి, వారిపై కేసులు నమోదు చేశారు. ఈ విధ్వంసానికి మొత్తం తొమ్మిది మంది పాల్పడినట్లు తేల్చారు. వారందరి ఫోటోలను రిలీజ్ చేశారు. ఆయిషీ, చున్ చున్, ప్రియారంజన్‌లతో పాటు సుచేత, యోగేంద్ర, వికాస్‌ పటేల్, పంకజ్‌కుమార్, డోలన్, మాలినీలు ఈ విధ్వంసానికి పాల్పడినట్లు వారు చెబుతున్నారు. విధ్వంసానికి పాల్పడే ముందు సీసీటీవీ సర్వర్‌ని ధ్వంసం చేసే సందర్భంలో రికార్డయిన వీడియోలను, ఫోటోలను ఢిల్లీ పోలీసులు శుక్రవారం మీడియాకు రిలీజ్ చేశారు. తొమ్మిది మంది అనుమానితులకు నోటీసులు జారీ చేసి, వివరణ కోరామని పోలీసులు చెప్పారు.

సీసీటీవీ ఫుటేజీ వివరాలతోపాటు ఫోటోలను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ డా. జోయ్ టిర్కీ మీడియా ముందుంచారు. ఆయిషీ ఘోష్, ప్రియారంజన్, చున్ చున్ కుమార్‌లు ప్లాన్ ప్రకారం యూనివర్సిటీలో విధ్వంసానికి పాల్పడ్డారని తేల్చారు. సీసీటీవీ కెమెరాలతో జనవరి 4వ తేదీన ధ్వంసం చేశారని జోయ్ టర్కీ వెల్లడించారు. నాలుగు వామపక్ష విద్యార్థి సంఘాలు సామూహికంగా, వ్యూహాత్మకంగా ఢిల్లీ యూనివర్సిటీలో అల్లర్లు సృష్టించాయని డీసీపీ వివరించారు. యూనివర్సిటీలోకి బయటి వ్యక్తులు వచ్చే అవకాశమే లేదన్నారాయన.

జెఎన్‌యు విధ్వంసానికి సంబంధించిన కేసులన్నింటినీ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కొనసాగిస్తోందని, ఈ విషయంలో ఎవరికి ఏ అనుమానం వున్నా తమను సంప్రదించవచ్చని డీసీపీ కోరారు. సమాచార లోపంతో వదంతులు వ్యాప్తి చేయవద్దని, అలా చేసే వారిపైనా చర్యలుంటాయని జోయ్ టర్కీ హెచ్చరించారు.

అయితే పోలీసుల వాదనతో విద్యార్థి సంఘం నేత ఆయిషీఘోష్‌ ఖండించారు. కేవలం పేర్లు చెప్పడం కాదు.. .ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జెఎన్‌యు వీసీని తప్పించాలని ఘోష్ కోరారు.