బ్రేకింగ్: నిర్భయ దోషులకు ఉరి కేసులో కీలక మలుపు

|

Feb 01, 2020 | 6:38 PM

నిర్భయ కేసు దోషుల ఉరితీత అమలుపై స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర హోంశాఖ, తీహార్ జైల్ అధికారులు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని ప్రత్యేకంగా విచారించేందుకు రంగం సిద్దమైంది. ఉరితీతపై విధించిన నిరవధిక స్టేను ఎత్తివేయాలని, నిందితులు చట్టంలోని లొసుగులను వాడుకుంటూ ఒక ఆటగా భావిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టులో ఈ కేసుపై ప్రత్యేక విచారణ జరుగనుంది. న్యాయ ప్రక్రియను దోషులు ఒక ఆటగా భావిస్తున్నారని, ఇలాంటి అవకాశం దోషులకు దక్కనీయవద్దని […]

బ్రేకింగ్: నిర్భయ దోషులకు ఉరి కేసులో కీలక మలుపు
Follow us on

నిర్భయ కేసు దోషుల ఉరితీత అమలుపై స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర హోంశాఖ, తీహార్ జైల్ అధికారులు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని ప్రత్యేకంగా విచారించేందుకు రంగం సిద్దమైంది. ఉరితీతపై విధించిన నిరవధిక స్టేను ఎత్తివేయాలని, నిందితులు చట్టంలోని లొసుగులను వాడుకుంటూ ఒక ఆటగా భావిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఢిల్లీ హైకోర్టులో ఈ కేసుపై ప్రత్యేక విచారణ జరుగనుంది. న్యాయ ప్రక్రియను దోషులు ఒక ఆటగా భావిస్తున్నారని, ఇలాంటి అవకాశం దోషులకు దక్కనీయవద్దని పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించాయి కేంద్ర హోం శాఖ, తీహార్ జైలు వర్గాలు.

శనివారం తెల్లవారుజామున అమలు కావాల్సిన ఉరి శిక్షపై పటియాలా కోర్టు శుక్రవారం నాడు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. దోషులు నలుగురిని ఉరి తీసేందుకు ట్రయల్స్ కూడా పూర్తి చేసిన నేపథ్యంలో స్టే రావడం యావత్ దేశాన్ని నివ్వెర పరిచింది. అసలు ఉరి శిక్ష అమలవుతుందా లేదా అన్న స్థాయిలో సోషల్ మీడియాలో కథనాలు, అభిప్రాయాలు వెల్లువెత్తాయి.

ఏడేళ్ళ క్రితం జరిగిన ఓ దారుణ సంఘటనలో బాధ్యులను ఉరి తీసేందుకు ఇంత జాప్యం ఎందుకంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చట్టంలోని లొసుగులను వినియోగించుకుంటూ.. క్యూరేటివ్ పిటిషన్ల పేరిట, క్షమాభిక్షల పేరిట, మైనర్ అన్న వాదనల పేరిట కాలయాపన జరపడం తప్ప దోషులకు శిక్ష విధించే పరిస్థితి లేదా అన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తక్షణం స్టే ఎత్తివేతకు హోంశాఖ, తీహార్ జైలు అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు తీహార్ జైలు అధికారులకు, దోషులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆదివారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.