రూ.45 లక్షలతో రోజంతా రోడ్డు మీదే ఆ జంట

|

Oct 21, 2020 | 7:20 PM

ఆ దంపతులు భారీ మొత్తాన్ని చేత పట్టుకుని నడిరోడ్డు మీద నిలబడ్డారు. గంటా రెండు గంటలు కాదు.. ఏకంగా రోజంతా నడి రోడ్డు మీద భారీ నగదున్న బ్యాగుతో ఎదురు చూశారు. కానీ వారు రాలేదు. వారి జాడే లేదు. వారిలో ఉత్కంఠ గంటగంటకీ పెరిగిపోతోంది.

రూ.45 లక్షలతో రోజంతా రోడ్డు మీదే ఆ జంట
Follow us on

Couple waiting on road with Money:  మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ విషయంలో హై డ్రామా కొనసాగుతోంది. కొడుకు బతికొస్తే చాలనుకుంటున్న దంపతులు రోజంతా 45 లక్షల రూపాయలతో రోడ్డు మీదే నిలబడ్డారు. కిడ్నాపర్లు చెప్పిన చోటే డబ్బుతో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసినా ఎవరూ రాలేదు. దాంతో దంపతుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మనీ పోతే పోయింది.. కొడుకు దక్కితే చాలనుకుంటున్న దంపతుల ఆశ నెరవేరుతుందో లేదో అన్న చర్చ తెలంగాణలో జోరందుకుంది.

మహబూబాబాద్ బాలుడు కిడ్నాపై 72గంటలు పూర్తి అయ్యింది. క్షణక్షణానికి ఉత్కంట పెరిగిపోతోంది. బాలుడిని కిడ్నాప్ చేసిన వారు ఇప్పటికి 11 సార్లు ఇంటర్‌నెట్ ద్వారా కాల్ చేశారు. ఎంత బతిమాలినా.. 45 లక్షల రూపాయలిస్తే గానీ బాలుడిని వదిలేయమని ఖరాఖండీగా చెప్పారు. మరోవైపు పోలీసులు కిడ్నాపర్లు చేసిన ఇంటర్‌నెట్ కాల్స్‌ని ఛేదించలేకపోతున్నారు. దాంతో ఎలాగోలా డబ్బు అరేంజ్ చేసుకుని కిడ్నాపర్ చెప్పిన చోటికి బుధవారం మధ్యాహ్నం చేరుకున్నారు.

మధ్యాహ్నం నుంచి కిడ్నాపర్లు చెప్పిన రోడ్డు మీదే 45 లక్షల రూపాయలతో ఆ దంపతులు తమ కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ కిడ్నాపర్ల జాడ లేకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు భీతిల్లుతున్నారు. వారిలో క్షణక్షణానికి టెన్షన్ పెరిగిపోతోంది. వారితో పాటు మహబూబాబాద్ పోలీసులు, స్థానికులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

Also read: పెళ్ళి పేరుతో యువతి మోసం..మైండ్ బ్లాక్ అయిన అబ్బాయి

Also read: ‘నో ఎంట్రీ జోన్’ నిబంధనలను సడలించిన హైకోర్టు

Also read: స్వప్నా సురేశ్ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్

Also read: అభిమానులకు శుభవార్త చెప్పిన సంజయ్‌దత్ 

Also read: తొక్కిసలాటలో 12 మంది మహిళలు దుర్మరణం