బ్లాంక్ చెక్ ఇచ్చేస్తారా? అయితే కాంగ్రెస్ టిక్కట్ మీకే!

|

Dec 31, 2019 | 8:16 AM

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కావాలా? బ్లాంక్ చెక్‌తో గాంధీభవన్‌ వెళ్తే మీ పని క్షణాల్లో అయిపోతుంది. ఆశ్చర్యంగా వుందా? కానీ ఇది అక్షరాలా నిజం. అయితే.. బ్లాంక్ చెక్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కొనుగోలు కోసం అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. అన్ని రాజకీయ పార్టీల్లాగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా జనవరిలో జరగనున్న మునిసిపల్ ఎన్నికలపై దృష్టి సారించారు. గాంధీభవన్‌లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం నిర్వహించిన సమావేశంలో కొంత రగడ […]

బ్లాంక్ చెక్ ఇచ్చేస్తారా? అయితే కాంగ్రెస్ టిక్కట్ మీకే!
Follow us on

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కావాలా? బ్లాంక్ చెక్‌తో గాంధీభవన్‌ వెళ్తే మీ పని క్షణాల్లో అయిపోతుంది. ఆశ్చర్యంగా వుందా? కానీ ఇది అక్షరాలా నిజం. అయితే.. బ్లాంక్ చెక్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కొనుగోలు కోసం అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే.

అన్ని రాజకీయ పార్టీల్లాగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా జనవరిలో జరగనున్న మునిసిపల్ ఎన్నికలపై దృష్టి సారించారు. గాంధీభవన్‌లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం నిర్వహించిన సమావేశంలో కొంత రగడ జరిగినప్పటికీ.. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఓ వెరైటీ నిర్ణయాన్ని తీసుకుంది. మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడంలో వెరైటీ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు. అయితే, ఈ నిర్ణయం వలస పక్షులను కంట్రోల్ చేసేందుకేనంటున్నారు కాంగ్రెస్ నేతలు.

మునిసిపల్ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో టి.కాంగ్రెస్ నేతలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. అయితే.. తాము అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అధికారపార్టీలోకి జంపవుతారని సందేహిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అందుకే వలసలను నివారించేందుకు కొత్త వ్యూహాన్ని రచించారు.

కాంగ్రెస్ పార్టీ తరపున మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందుగా ఓ బ్లాంక్ చెక్, స్టాంప్ పేపర్ మీద రాసిచ్చే ఓ బాండ్.. ఈ రెండింటిని తమ అప్లికేషన్లతోపాటు సబ్మిట్ చేయాలని పిసిసి పార్టీ వర్గాలను ఆదేశించింది. వీరిలో వడపోత తర్వాత మిగిలిన అభ్యర్థుల నుంచి తీసుకున్న బ్లాంక్ చెక్కులను, బాండ్ పేపర్లను గాంధీ భవన్‌లో భద్రపరుస్తారు. మిగిలిన వారివి తిరిగి ఇచ్చేస్తారు. ఇలా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి, వేరే పార్టీకి జంప్ అవ్వాలనుకుంటే వారిని లీగల్‌గా ఇరుకున పెట్టేందుకు టిపిసిసి కార్యవర్గం వ్యూహం రచించింది. బ్లాంక్ చెక్కులు, బాండ్ పేపర్లను లీగల్‌గా చెక్ చేయించుకున్న తర్వాతనే అభ్యర్థులకు బి-ఫామ్స్ ఇవ్వాలని టిపిసిసి భావిస్తోంది. ఈవ్యూహంతో గెలుపు గుర్రాల జంపింగ్ జపాంగ్‌లు ఆగుతాయో.. లేక పోతే పోయింది చెక్కు… అని జంప్ అవుతారో వేచి చూడాల్సిందే.