Breaking news వైసీపీ ఎమ్మెల్యేలపై హైకోర్టులో ఫిర్యాదు

|

May 19, 2020 | 6:56 PM

వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు ఏకంగా ఏపీ హైకోర్టుకు చేరింది. ముగ్గురు వైఎస్సీర్సీపీ ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్‌ను బుధవారం హైకోర్టు విచారించనున్నది.

Breaking news వైసీపీ ఎమ్మెల్యేలపై హైకోర్టులో ఫిర్యాదు
Follow us on

Petition filed in AP high court against three YCP MLAs: వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు ఏకంగా ఏపీ హైకోర్టుకు చేరింది. ముగ్గురు వైఎస్సీర్సీపీ ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్‌ను బుధవారం హైకోర్టు విచారించనున్నది. ఎమ్మెల్యేల తప్పిదాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను హైకోర్టుకు సమర్పించారు పిటిషన్ దారులు.

మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలపై హైకోర్టుకు ఫిర్యాదు అందింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి జన సమూహాలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది ఇంద్రనీల్. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిపై అనుబంధ పిటిషన్‌లో అభియోగాలను మోపారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు జన సమూహాలతో కార్యక్రమాలు నిర్వహించారన్నది పిటిషన్ దారుని ఆరోపణ. వారు నిర్వహించిన కార్యక్రమాల వీడియోలు, ఫోటోలు కోర్టుకు అందజేశారు పిటిషనర్ కిషోర్.

ఇంద్రనీల్ ఫైల్ చేసిన ఈ తాజా పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనున్నది. ఇప్పటికే ఏపీలో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఇలానే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ హైకోర్టులో పిటిషన్లు ఫైలయ్యాయి. వారందరికీ కోర్టు నోటీసులు జారీ చేసింది. తాజాగా మరో ముగ్గురిపై సేమ్ పిటిషన్ దాఖలు కావడంతో వారికి కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశం వుంది. తాజా పిటిషన్‌తో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న వైఎస్సార్పీసీ ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది.