
హైదరాబాద్: టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మేనల్లుడు ధర్మారామ్ ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నారాయణ జూనియర్ కాలేజీ లో ఇంటర్ చదువుతున్న ధర్మారామ్ ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు. దీనితో మనస్తాపం చెందిన అతడు శుక్రవారం రాత్రి తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ ఏడో ఫ్లోర్ నుంచి క్రిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ విషయం బయటికి రాకుండా గోప్యంగా ఉంచినట్లు సమాచారం.